telugu navyamedia
culture news study news

నవోదయ విద్యాలయాల్లో 27 శాతం ఓబీసీ రిజర్వేషన్‌!

Jawahar Navodaya

జవహర్ నవోదయ కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాల కొరకు 27 శాతం ఓబీసీ రిజర్వేషన్‌ ను ఈ విద్యా సంవత్సరం (2020-21) అమలు చేయనున్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్న 1200 విద్యాలయాల్లో ఒకటో తరగతిలో ప్రవేశానికి ఈ కోటా అమలు కానుంది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ, కేంద్రీయ విద్యాలయ సంగఠన్ (కేవీఎస్)కు లేఖ రాసింది. పాలసీ గురించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపింది. ఓబీసీల సంక్షేమం కోసం ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ గతేడాది డిసెంబర్లో ఇచ్చిన నివేదిక ఆధారంగా కోటాపై నిర్ణయం తీసుకున్నారు.

కేవీ అడ్మిషన్ పాలసీ ప్రకారం ప్రస్తుతం ఆర్టీఈ (రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్)కి 25 శాతం, ఎస్‌సీలకు15 శాతం , ఎస్టీలకు 7.5 శాతం సీట్లు కేటాయిస్తున్నారు. అలాగే, వికలాంగులకు మూడు శాతం కోటా ఉంది. దీంతో పాటు ఐదు సీట్లను డిఫెన్స్, రైల్వేస్, ప్రభుత్వ రంగం సంస్థలు సిఫారసు చేసిన వారికి ఇస్తున్నారు.. కొత్త నిబంధనల ప్రకారం ప్రతి స్కూల్‌ మొదటి తరగతిలో 10 సీట్లు ఆర్టీఈకి, ఆరు సీట్లు ఎస్‌సీలకు, మూడు సీట్లు ఎస్టీలకు, 11 సీట్లు ఓబీసీలకు కేటాయించనున్నారు.

Related posts

మొరాయించిన ఈవీఎంలు..ఆలస్యంగా పోలింగ్

vimala p

నీళ్లలో ఉండే వెనిస్ సిటీలా హైదరాబాద్‌ను మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది

Vasishta Reddy

తాము బీజేపీలో చేరలేదు.. క్లారిటీ ఇచ్చిన ఆప్ ఎమ్మెల్యేలు

vimala p