telugu navyamedia
రాజకీయ వార్తలు

ఢిల్లీ ఆస్ప‌త్రుల్లో స్థానికులకే క‌రోనా చికిత్స‌: కేజ్రివాల్‌

arvind-kejriwal

ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో సీఎం కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ ఆస్ప‌త్రులు, కొన్ని ప్రైవేటు ఆస్ప‌త్రులను ఢిల్లీ ప్రజల కోసమే రిజర్వు చేసిన‌ట్లు తెలిపారు. రోజురోజుకు పెరుగుతున్న కేసులతో కరోనా రోగులకు ఆస్ప‌త్రులు సరిపోవడం లేదనీ అన్నారు. దీని క‌రోనా బాధితులు తీవ్ర ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంద‌ని, అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని కేజ్రివాల్ చెప్పారు.

క‌రోనా చికిత్స‌ విషయంపై సర్వే నిర్వహించామని, 90 శాతం మంది ప్రజల అభిప్రయాల మేరకు తుది నిర్ణ‌యం చేశామ‌ని కేజ్రివాల్ వెల్ల‌డించారు. అయితే, కేంద్ర ప్ర‌భుత్వ ప‌రిధిలోని ఆస్ప‌త్రుల్లో మాత్రం ఢిల్లీయేత‌రులు కూడా చికిత్స పొంద‌వ‌చ్చ‌ని ఆయ‌న తెలిపారు. జూన్ చివ‌రి నాటికి ఢిల్లీలో మరో 15 వేల పడకలు అవసరమవుతాయని కమిటీ తెలిపిన‌ట్లు కేజ్రివాల్‌ పేర్కొన్నారు. 

Related posts