telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విడుదలకు సిద్ధమవుతున్న కీర్తి సురేష్ సినిమాలు… ఏకంగా 6…!!

Keerthy-Suresh

2008లో ‘మహానటి’గా మురిపించిన కేరళకుట్టి కీర్తి సురేశ్ గత ఏడాది ‘మన్మథుడు 2’లో అతిథి పాత్రకే పరిమితమైంది. ఈ సంవత్సరం ఏకంగా అరడజను చిత్రాలతో పలకరించబోతోంది. మరీ ముఖ్యంగా… 2020 మార్చి నెలలో మూడు వారాల గ్యాప్ లో రెండు సినిమాలతో సందడి చేయనుంది. మార్చి 6న తెలుగు చిత్రం ‘మిస్ ఇండియా’తో మెస్మరైజ్ చేయనున్న మిస్ కీర్తి… అదే నెల 26న పాన్ – ఇండియా ప్రాజెక్ట్ అయిన మలయాళ మూవీ ‘మరక్కర్’తో ఎంటర్ టైన్ చేయనుంది. మార్చి నెలలో కీర్తి నాయికగా నటించిన ‘మిస్ ఇండియా’, ‘మరక్కర్’ విడుదల కానుండగా… సమ్మర్ సీజన్ లో ‘రంగ్ దే’, ‘పెంగ్విన్’, ‘గుడ్ లక్ సఖి’ చిత్రాలు సందడి చేయనున్నాయి. ఇక ఏడాది ద్వితీయార్ధంలో రజనీకాంత్ కి కూతురుగా నటిస్తున్న పేరు నిర్ణయించని తమిళ సినిమా రిలీజ్ కానుంది. విశేషమేమిటంటే… ఈ ఆరు చిత్రాలు కూడా విభిన్న కథాంశాలతోనే తెరకెక్కుతున్నాయి. మరి ఈ చిత్రాలు కీర్తికి ఎలాంటి విజయాలను మిగులుస్తాయో చూడాలి.

Related posts