• Home
  • Trending Today
  • ఆ పాత్రను చేసే ధైర్యం చేయనంటున్న కీర్తి సురేష్
Trending Today సినిమా వార్తలు

ఆ పాత్రను చేసే ధైర్యం చేయనంటున్న కీర్తి సురేష్

keerthy-suresh

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ తెరకెక్కనుందని, ఆ బయోపిక్ లో కీర్తి సురేష్ గానీ, మన జేజమ్మ అనుష్క కానీ నటిస్తారనే వార్తలు విన్పించాయి. కానీ ఇప్పుడు కీర్తి సురేష్ ఈ వార్తలపై స్పష్టతనిచ్చింది. “అమ్మ” జయలలిత పాత్ర చేసే ధైర్యం తనకు లేదని, నటిగా, రాజకీయ నాయకురాలిగా అంత గొప్ప పేరు తెచ్చుకున్న “అమ్మ” పాత్రను చేయాలంటే ఏంతో పరిణితి కావాలని చెబుతోంది. మరి సావిత్రి పాత్రను ఎలా చేశారని ప్రశ్నించగా సమాధానం దాటవేసింది కీర్తిసురేష్. జయలలిత బయోపిక్ చేయనని చెప్పకనే చెప్పేసింది మన “మహానటి”.

దీంతో కీర్తి సురేష్ “అమ్మ” పాత్రను చేయడానికి ఎందుకు భయపడుతోందనే ప్రశ్న మొదలైంది కీర్తి అభిమానుల్లో. అయితే నటి,రాజకీయ నాయకురాలు జయలలిత పాత్రను చేస్తే రాజకీయ కోణంలో చూసేవారి మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందని, అది తన సినిమా కెరీర్ కు మంచి విషయం కాదని, అందుకే కీర్తి ఈ పాత్రను చేయడానికి ఆసక్తి చూపడం లేదంటూ కోలీవుడ్ లో ఓ టాక్ నడుస్తోంది. మరోవైపు అనుష్క ఈ పాత్ర చేస్తుందని వార్తలపై స్పష్టత లేకుండా పోయింది.

Related posts

'rx100' ఫస్ట్ లుక్…?

admin

అగ్రిగోల్డ్ ఆస్తులు…’పచ్చ’ కర్పూర హారతి… : బీజేపీ నేత జివిఎల్

chandra sekkhar

విండీస్ ని చిత్తులో కలిపి భారీ విజయం సాధించిన భారత్..

nagaraj chanti

Leave a Comment