telugu navyamedia
news telugu cinema news trending

నాకు కాబోయేవాడు.. విజయ్, విక్రమ్ లా ఉండాలి అంటున్న కీర్తి సురేష్..

keerthisuresh on her marriage

మహానటితో ఎందరి మనసులనో గెలుచుకున్న కీర్తి సురేష్ తన వివాహం గురించి ప్రస్తుతం అనేక చోట్ల ప్రశ్నలు ఎదుర్కొంటుంది. దానికి సమాధానం కూడా అలాగే చెపుతుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో అదే ప్రశ్న వేయగా, సమాధానం ఏమి చెప్పిందో చూడండి.. ఈ ఏడాది తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించిన నటి కీర్తి సురేష్‌. తనపై వస్తున్న వదంతులను, ఐరన్‌లెగ్‌ వంటి మాటలను పటాపంచెలు చేసి.. ‘మహానటి’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన కీర్తి.. 2019లో కూడా చాలా బిజీ తారగానే ఉండబోతోంది. ఆమె నాలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అజిత్‌ చిత్రంలో కూడా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా నూతన సంవత్సరం సందర్భంగా ఓ ప్రైవేటు ఛానెల్‌ ఇంటర్వ్యూలో కీర్తిసురేష్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొన్ని ఫొటోలు పెట్టి.. ‘వీరిలో ఎవరిలా మీ భర్త ఉండాలనుకుంటున్నారు?’ అని ఓ ప్రశ్న అడిగారు. వాటిలో అజిత్‌, విజయ్‌, విక్రం, సూర్య, శింబు, జయంరవి, విజయ్‌సేతుపతి, శివకార్తికేయన్‌ ఫొటోలు ఉన్నాయి. అయితే ఈ ప్రశ్నకు ఏమాత్రం తటపటాయించుకుండా.. వెంటనే సమాధానమిచ్చింది కీర్తి. ‘ఈ ఫొటోల్లో ఉన్న ప్రతి ఒక్కరూ నాకు ఇష్టమే. అదేవిధంగా విజయ్‌, విక్రం లాగా ఉండాలనుకుంటున్నా’ అంటూ వెంటనే సమాధానమిచ్చారు.

Related posts

హైదరాబాద్ : పబ్ జీ గేమ్‌ కు .. మరో బాలుడు బలి..

vimala p

టీడీపీనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది: కోడెల

vimala p

22-27 వరకు .. కడపలో కానిస్టేబుల్ అభ్యర్థులకు .. దేహదారుఢ్య పరీక్షలు..

vimala p