telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కీర్తి సురేశ్ ‘మిస్ ఇండియా’ రిలీజ్ డేట్ ఖరారు

Miss-India

మహానటి గా తెలుగు ప్రేక్షకులను అలరించిన కీర్తి సురేశ్ వరుసగా తమిళ సినిమాలు చేస్తూ వెళ్లింది. దాంతో సహజంగానే తెలుగులో గ్యాప్ వచ్చేసింది. తెలుగులో నాయిక ప్రాధాన్యత కలిగిన పాత్రలో ఆమె ‘మిస్ ఇండియా’ సినిమాను మాత్రమే అంగీకరించింది.నరేంద్రనాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి తాజాగా విడుదల తేదీని ఖరారు చేశారు. ఏప్రిల్ 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిర్మితమైన ఈ సినిమాలో జగపతిబాబు .. రాజేంద్ర ప్రసాద్ .. సీనియర్ నరేశ్ .. నవీన్ చంద్ర తదితరులు ముఖ్యమైన పాత్రలను పోషించారు. కొంత గ్యాప్ తరువాత కీర్తి సురేశ్ చేసిన ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

Related posts