telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కోడెల ఇంటికి అసెంబ్లీ సామాగ్రి.. చీఫ్ మార్షల్ పై బదిలీవేటు!

kodela shivaprasad

టీడీపీ నేత, ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తన ఇంటికి తరలించిన ఫర్నీచర్ వ్యవహారం పై ప్రభుత్వం చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది. కోడెల ఇంటికి అసెంబ్లీ సామాగ్రి తరలింపు వివాదంలో అసెంబ్లీ చీఫ్ మార్షల్ గణేష్ బాబుపై బదిలీవేటు వేసింది. కోడెల ఇంటికి అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపులో అసెంబ్లీ చీఫ్ మార్షల్ గణేష్ బాబు పాత్ర ఉందంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేస్తోంది. అందులో భాగంగా చీఫ్ మార్షల్ గణేష్ బాబుపై తొలివేటు వేసింది.

ఫర్నీచర్ తరలింపు వ్యవహారంలో ఎవరి పాత్ర ఉన్నా ఉపేక్షించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇకపోతే అసెంబ్లీ సామాగ్రిని తానే వాడుకున్నానని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంగీకరించారు. అసెంబ్లీలో భద్రత ఉండదన్న ఉద్దేశంతోనే తన ఇంటికి తరలించినట్లు చెప్పుకొచ్చారు. తీసుకెళ్తే ఫర్నీచర్ అయినా తీసుకెళ్లండి లేకపోతే డబ్బులు అయినా తీసుకెళ్లండి అంటూ కోడెల వెల్లడించిన సంగతి తెలిసిందే.

Related posts