telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

డబ్బులు డ్రా కోసం ఇళ్లవద్దకే ఏటీఎంలు!

Lockdown Moboile ATM

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న నేపధ్యంలో ప్రజలంతా ఇంటికే పరిమితమవుతున్నారు. బ్యాంకు ఖాతాలో డబ్బులున్నప్పటికీ చేతికి సకాలంలో డబ్బులందక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటివారికోసం కేడీసీసీ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులకు వెళ్లలేక, సొమ్మును విత్ డ్రా చేయలేకపోతున్న వారి సౌలభ్యం కోసం మొబైల్ ఏటీఎంలను ఏర్పాటు చేసింది.

ప్రజల సౌకర్యార్థం ఏటీఎంలను వారి ఇళ్లవద్దకే పంపుతున్నట్టు బ్యాంకు చైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు వెల్లడించారు. డబ్బులు కావాలని భావించే వారు ఆయా గ్రామాల్లోని సహకార సంఘం కార్యదర్శికి సమాచారం ఇవ్వాలని ఆ వెంటనే ఆయా వీధుల్లోకి మొబైల్ ఏటీఎంలను పంపిస్తామని వెల్లడించారు. విజయవాడ, నూజివీడు డివిజన్లకు సంబంధించి 99496 88340, గుడివాడ, మచిలీపట్నం డివిజన్లకు సంబంధించి 99496 88362 నంబర్ కు ఫోన్ చేయాలని వెంకట్రావు సూచించారు.

Related posts