telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

కేసీఆర్ కల చెదిరి… తెరాస  కథ మారిందా ?

KCR's dream Will Change or come true
తెలంగాణ రాష్ట్రంలో తెరాస పార్టీ పట్ల ప్రజల్లో వున్నా వ్యతిరేకత పార్లమెంట్  ఎన్నికల్లో వెల్లడయ్యింది . తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణను చేస్తానని చంద్ర శేఖర్ రావు ప్రజలను ఇంతకాలం భ్రమలో పెడుతూ వస్తున్నాడు . చంద్ర శేఖర్ రావు అనుసరిస్తున్న విధానాలు , ఒంటెద్దు పోకడలు చాలా మందికి నచ్చడం లేదు . ప్రతిపక్ష  పార్టీలను లేకుండా చెయ్యాలని , తద్వారా తనకు ఎదురు ఉండదని కేసీఆర్ భవిస్తూ వస్తున్నాడు . తన రాజకీయ అవసరం కోసమే కొందరిని దగ్గరగా తీసుకోవడం , అవసరం లేదనుకుంటే ఇంటర్వ్యూ కూడా ఇవ్వకపోవడం ,రాష్ట్రాన్ని అప్పుల్లొకి తీసుకెళ్లడం , తానీ సుప్రీమ్ నేనే అహంభావం .. వీటన్నింటినీ మించి తెలంగాణాలో తనకు ఎదురులేదని భావించిన కేసీఆర్ రాష్ట్రాన్ని తన కుమారుడును అప్పగించాలని పార్టీకి ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా చేశాడు .
kcr special pooja in kaleswaram
తాను  ఢిల్లీలో చక్రం తిప్పాలని ఉద్దేశ్యం తో ఫెడరల్ ఫ్రంట్ అంటూ కర్ణాటక వెళ్లి దేవే గౌడను , ఒడిస్సా వెళ్లి నవీన్ పట్నాకను , చెన్నై వెళ్లి స్టాలిన్ ను , పశ్చిమ బెంగాల్ వెళ్లి మమతను కలుసుకుంటూ ప్రయత్నాలు ముమ్మరం చేయ్యసాగాడు . వారి నుంచి అనుకున్న స్పందన రాలేదు . ఇవ్వన్నీ ప్రజలు గమనిస్తూనే వున్నారు . కేసీఆర్ నమ్మకం పార్లమెంట్ ఎన్నికల్లో వమ్మై పోయింది . ఇంతకాలం కారు ,,కేసీఆర్ సారూ .. సీట్లు పదహారు  అంటూ ఎన్నికల సభల్లో దంచి పారేశారు . నిజామాబాద్ ఎంపికగా  వున్న కేసీఆర్ కుమార్తె కవిత ఆప్రాంతాన్ని పట్టించుకోలేదని తెలిసిపోయింది . అక్కడ పసుపును రైతులు విస్తారంగా పండిస్తారు . గిట్టుబాటు ధరతో పాటు పసుపు బోర్డు కూడా ఏర్పాటు చెయ్యమని ఎంతో కాలంగా రైతులు కవితకు మొరపెట్టుకుంటున్నారు . కానీ కవిత రైతులను పట్టించుకోలేదు . 
KCR Cabinet Chance News MLAs
అందుకే నిజాబాబాద్లో రైతులు పోటీలో నిలబడింది . దీంతో కేసీఆర్ , కవిత వారిని బుజ్జగించారు. కానీ వారెవ్వరూ వెనక్కి తగ్గలేదు . అప్పుడు కేసీఆర్ జుబిలీహిస్స్ లో వున్న మండవ వెంకటేశ్వర రావు నివాసానికి వెళ్లి కవిత కు సహాయం చెయ్యమని కోరాడు . వెంకటేశ్వర రావు కవిత తరుపున  ప్రచారం చేశాడు . కానీ జనాగ్రహమ్ ముందు కవిత చిత్తుగా ఓడిపోయింది . 70, 875 ఓట్ల తేడాతో కవిత అరవింద్ ఓడించాడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ . ఇతను సీనియర్ నాయకుడు డి .శ్రీనివాస్ కుమారుడు . . ఈసారి భారతీయ జనతా పార్టీ నాలుగు ఎంపీ స్థానాలను గెలుసుకొని అందరినీ ఆశ్చర్య పరిచింది . సికింద్రాబాద్ నుంచి జి . కిషన్ రెడ్డి , ఆదిలాబాద్ నుంచి సోయం బాబు రావు , కరీం నగర్ నుంచి బండి  సంజయ్ కుమార్ ఎక్కువ మెజార్టీతో గెలిచారు .
bjp lakshman fire on kcr and ktr
కేసీఆర్ కు ఆయనంత సన్నిహితుడు , బంధువు  బోయినపల్లి వినోద్ కుమార్ కరీంనగర్లో బండి సంజయ్ చేతిలో 89,509 ఓట్ల తేడాతో ఓడిపోయాడు . ఇక కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి ,భువనగిరిలో కోమటిరెడ్డి వెంకట రెడ్డి ,నల్గొండలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపొందారు . అంటే తెరాస  ఏడు సీట్లల్లో ఘోరంగా ఓడిపోయింది .  భారతీయ జనతా పార్టీ , కాంగ్రెస్ పార్టీలను తెలంగాణ ప్రజలు ఆదరించడం మొదలు పెట్టారని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏమికావాలి . తెలంగాణాలో భారతీయ జనతా పార్టీ నాయకుడు అమిత్ షా వ్యూహం ఫలించిందని రాజకీయ పండితులు అభిప్రాయం పడుతున్నారు . ఇది బిజెపికి సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది . తెలంగాణ నుంచి జి .కిషన్ రెడ్డి కేంద్రంలో మంత్రి కాబోతున్నాడు . 
రానున్న రోజుల్లో తెరాస కు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ ఎదిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి . కేసీఆర్ మధుర స్వప్నం …. ఫలించలేదు … కారు జోరుకు బదులు .. తీరు మారి స్లో అయిపొయింది . ఇటు రాష్ట్రంలో తన కుమారుడుని ముఖ్యంమత్రి గా చేసి అటు తాను  కేంద్రంలో ఉప ప్రధాని కావాలనుకున్నాడు . రెండు విఫలమయ్యాయి . మొన్నటివరకు కాంగ్రెస్ పార్టీకి , భారతీయ జనతా పార్టీకీ ఫెడరల్ ఫ్రంట్ ప్రత్యామ్నాయం అని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఏమిచేయాలో తెలియడం లేదు . మళ్ళీ మోడీ దగ్గరకు వెళ్లి శరణు అంటాడా ? ఒకవేళ కేసీఆర్ వినయం ప్రకటించినా  మోడీ కరుణిస్తాడా ? కేసీఆర్ ఏమి చెయ్యబోతున్నాడు ?
-భగీరథ 

Related posts