telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్ ను తిడుతూ వీడియో పోస్ట్ .. తెలంగాణ యువకుడు అరెస్ట్!

Kcr vedeo post youth arrest telangana

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను దూషిస్తూ ఓ వీడియోను తయారుచేసిన యువకుడిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వీడియోను టిక్ టాక్ యాప్ లో రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. ఈ విషయాన్ని టీఆర్ఎస్ శ్రేణులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లాయి.వెంటనే రంగంలోకి దిగిన రాచకొండ పోలీసులు ఫోన్ లొకేషన్, ఫేస్ బుక్ ఖాతా ఆధారంగా యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అశ్లీలతను ప్రోత్సహించేలా ఉందంటూ దేశవ్యాప్తంగా టిక్ టాక్ పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో గూగుల్, యాపిల్ సంస్థలు తమ యాప్ స్టోర్స్ నుంచి దీన్ని తొలగించాయి. ఇటీవల చైనాకు చెందిన ఓ కంపెనీ టిక్ టాక్ ను అభివృద్ధి చేసింది.

Related posts