telugu navyamedia
news political Telangana

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన: సీఎం కేసీఆర్‌

KCR Tells Leaders Party Development

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగించాలని టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో మరోసారి ఏర్పడిన ప్రభుత్వానికి మంచి మంత్రివర్గం ఉంటుందన్నారు. టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్‌ నియమితులైన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన శుక్రవారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ..ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానకర్తలుగా ఉండి పార్టీని మరింత బలోపేతం చేయాలని అన్నారు.

రాష్ట్రం సాధించినందుకు అప్పుడు, ఆశించిన పాలన అందించినందుకు ఇప్పుడు ప్రజలు అధికారం ఇచ్చారన్నారు. ప్రభుత్వానికి మద్దతుగా పార్టీ నిలవాలంటే మరింత ధృడంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం ఏం చేయాలో పార్టీ నిర్ణయించాలని, కేటీఆర్‌ ప్రతిరోజు మీకు అందుబాటులో ఉంటారని తెలిపారు. సంస్థాగతంగా గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం బలోపేతం చేయాలని అన్నారు. పార్టీలో అందరికీ భాగస్వామ్యం ఉంటుందని టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. స్థానిక పరిస్థితుల కారణంగా పార్టీకి ఎవరూ దూరం కావొద్దని… ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటామని చెప్పారు.

Related posts

ఐదు రోజులు బ్యాంకులు మూత..లావాదేవీలు పూర్తి చేసుకోండి

vimala p

చెత్తతో.. ఛాయ్.. ఇదోరకమైన బార్టర్ సిస్టం..

vimala p

తెలంగాణ మంత్రుల ప్రమాణ స్వీకారం

ashok