telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

కాళేశ్వరంలో … కేసీఆర్ మకాం..

kcr special pooja in kaleswaram

సీఎం కేసీఆర్ రామగుండం ఎన్టీపీసీ గెస్ట్‌హౌజ్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కాళేశ్వరం బయలుదేరారు. కాళేశ్వరం చేరుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం కన్నెపల్లికి చేరుకున్నారు. ఇక్కడి నుంచి రోడ్డు మార్గాన సమీపంలోని కాళేశ్వరం ఆలయం సందర్శిస్తారు.

కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి.. తిరిగి కన్నెపల్లి పంపుహౌజ్ వద్ద ఉన్న హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుని హెలికాప్టర్‌లో కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్‌కు సీఎం బయల్దేరుతారు.

Related posts