• Home
  • వార్తలు
  • కేసీఆర్ ప్ర‌సంగానికి ఆ భ‌య‌మే కార‌ణ‌మా…??
రాజకీయ వార్తలు వార్తలు సమీక్ష వార్తలు

కేసీఆర్ ప్ర‌సంగానికి ఆ భ‌య‌మే కార‌ణ‌మా…??

CM KCR Fire to Congress TTDP

ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌….తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్..బ‌హిరంగ స‌భ గురించి ప్ర‌క‌టించిన ద‌గ్గ‌ర‌నుంచి..ఇప్ప‌టిదాకా తెలంగాణ రాజ‌కీయాలన్నీ….ఈ స‌భ చుట్టూనే తిరిగాయి. 1600 ఎక‌రాల స్థ‌లంలో పాతిక ల‌క్ష‌ల మందితో కేసీఆర్ స‌భ నిర్వ‌హించ‌త‌ల‌పెట్టిన‌ప్పుడు...ప్ర‌గతి నివేద‌న అని పేరు పెట్టిన‌ప్పుడు…రాజ‌కీయ పార్టీల‌కే కాదు…సామాన్య ప్ర‌జ‌ల‌కూ…ఎంతో ఆస‌క్తి క‌లిగింది.

Relief To TRS In High Court, Pragathi Nivedhana

మీడియా అయితే ప‌దిరోజులుగా…ప్ర‌గ‌తి నివేద‌న స‌భ గురించి, ఏర్పాట్ల గురించే చ‌ర్చిస్తోంది. కేసీఆర్ ముంద‌స్తు స‌న్నాహాలు, ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌, జోన‌ల్ వ్య‌వ‌స్థ‌కు ఆమోదం వంటి ప‌రిణామాల నేప‌థ్యంలో …ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌లో ముఖ్య‌మంత్రి నుంచి స్ప‌ష్ట‌మైన ప్రక‌ట‌న ఆశించారు ప్ర‌జ‌లు. ముంద‌స్తు దాదాపు ఖ‌రార‌యిన‌ట్టేన‌ని, స‌భ‌లో కేసీఆర్ ప్ర‌క‌ట‌నే త‌రువాయ‌ని, అస‌లు స‌భ ఉద్దేశ‌మే…ముంద‌స్తు శంఖారావం మోగించేందుకే అన్న‌ విశ్లేష‌ణ‌లు వినిపించాయి. ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌తో కేసీఆర్ విశ్వ‌రూపం చూపిస్తార‌ని, నాలుగున్న‌రేళ్ల ప్ర‌భుత్వ విజ‌యాలు వివ‌రిస్తూ…భ‌విష్య‌త్ ల‌క్ష్యాలపై ఎన్నో ఆశ‌లు క‌ల్పిస్తార‌ని, ప్ర‌తిప‌క్షాల‌ను చీల్చిచెండాడుతార‌ని అంతా భావించారు.

CM Kcr, Inspect, Pragathi Nivedana, Sabha|

కానీ కేసీఆర్ ప్ర‌సంగం ఇందుకు విరుద్ధంగా సాగ‌డం అనేకానేక సందేహాల‌కు తావిస్తోంది. త‌న ప్ర‌సంగాల తీరుతో ప్ర‌త్య‌ర్ధుల‌ను గుక్క‌తిప్పుకోనివ్వ‌ని కేసీఆర్ కొంగ‌ర‌క‌లాన్ స‌భ‌లో మాత్రం మొక్కుబ‌డిగా మాట్లాడిన భావ‌న క‌లిగింది. కేసీఆర్ ప్ర‌సంగం ముగిసిన వెంట‌నే సోష‌ల్ మీడియా హోరెత్తిపోయింది. నాలుగున్న‌రేళ్ల‌గా ప్రెస్ మీట్ల‌లో పదే ప‌దే చెబుతున్న విష‌యాలను ఇంకోసారి చెప్ప‌డానికి ఇంత భారీ ఖ‌ర్చు, హంగామా, జ‌న‌సమీక‌ర‌ణ అవ‌స‌రమా అని నెటిజ‌న్లు ప్ర‌శ్నించారు. తెలంగాణ పత్రిక‌ల‌తో పాటు….ప్ర‌ధాన మీడియా అంతా స‌భ సూప‌ర్ హిట్ట‌యిందని చెప్పే ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ…సోష‌ల్ మీడియా మాత్రం ప్ర‌గ‌తినివేద‌న స‌భ‌ను అట్ట‌ర్ ఫ్లాప్ గా తేల్చేసింది.

KCR No statement for, Assembly desolved

కొంగ‌ర‌క‌లాన్ పేరును ప్ర‌స్తావిస్తూ…కొంగ జ‌పంగా అభివ‌ర్ణిస్తూ….సోష‌ల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. స‌భపై అంద‌రూ మ‌న‌సు పెట్టారు…ఒక్క కేసీఆర్ త‌ప్ప అని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.  అట్ట‌హాసంగా నిర్వ‌హించిన స‌భ‌లో కేసీఆర్ ఇలా ఉసూరుమనిపించ‌డానికి…ఓట‌మి భ‌య‌మే కార‌ణ‌మ‌న్న‌ వెట‌కార‌పు వ్యాఖ్య‌లూ విన‌ప‌డుతున్నాయి. స‌భ త‌ర్వాత టీఆర్ ఎస్ కు కేసీఆర్ కొత్తఉత్సాహం ఇస్తార‌ని, ఈ ఊపుతో ముంద‌స్తుకు వెళ్లి మ‌రోసారి పార్టీ చ‌రిత్రాత్మ‌క విజ‌యం సాధిస్తుంద‌ని అనుకుంటే…ప‌రిస్థితి ఇందుకు భిన్నంగా మారిపోయింది. ప్ర‌గ‌తి నివేద‌న స‌భ తర్వాత విచిత్రంగా టీఆర్ ఎస్ చ‌ప్ప‌ప‌డిపోగా…ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ నేత‌ల్లో మాత్రం ముందెన్న‌డూ లేని ఉత్సాహం క‌న‌ప‌డుతోంది. ప్ర‌గ‌తి నివేద‌న స‌భ అట్ట‌ర్ ఫ్లాప్ప‌ని, ఓట‌మి భ‌యంతోనే కేసీఆర్ ముంద‌స్తు ప్ర‌క‌ట‌న చేయ‌లేద‌ని, ఈ స‌భ‌తోనే టీఆర్ ఎస్ పత‌నం ప్రారంభ‌మ‌యింద‌ని…కాంగ్రెస్ నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

congress

ఒక‌ప్పుడు కేసీఆర్ స‌భా ప్ర‌సంగం త‌ర్వాత  ఆయ‌న ప్ర‌త్య‌ర్ధులు చేసే విమ‌ర్శ‌లు చ‌ప్ప‌గా, అనాస‌క్తిగా సాగేవి. కేసీఆర్ ప్ర‌సంగం మూడ్ లో ఉండే మీడియాకు, ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్య‌ర్ధుల మాటలు అసలు చెవికెక్కేవి కాదు. కానీ కొంగ‌ర‌కలాన్ స‌భ త‌ర్వాత‌…కాంగ్రెస్ నేత‌లంతా మితిమీరిన ఉత్సాహంతో మీడియా స‌మావేశాల్లో మాట్లాడుతున్నారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ అగ్ర నేత‌లంతా వ‌రుస‌గా ప్రెస్ మీట్లు పెట్టి…కేసీఆర్ పై వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు. సోష‌ల్ మీడియాలో కూడా కేసీఆర్ పై తీవ్ర‌స్థాయిలో అస‌హ‌నం వ్య‌క్త‌మ‌వుతోంది. తెలంగాణ ఉద్య‌మం సాగిన 13 ఏళ్ల‌లోగానీ…ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డి, టీఆర్ ఎస్ అధికారంలోకివ‌చ్చిన ఈ నాలుగన్న‌రేళ్ల కాలంలో కానీ కేసీఆర్ పై ఈ స్థాయిలో వ్య‌తిరేక‌త ఎప్పుడూ క‌నిపించ‌లేదు. మొత్తంగా అందరూ క‌లిసి స‌భ నిస్తేజంగా, నిస్స‌త్తువగా, నిరాశాజ‌న‌కంగా, నిరుత్సాహంగా సాగింద‌ని తేల్చేశారు. నిజానికి త‌న ప్రసంగాలు, చ‌ర్య‌లు, మాట‌తీరులో అనుక్ష‌ణం ఆత్మ‌విశ్వాసం ఉట్టిప‌డేలా క‌నిపించే కేసీఆర్ కొంగ‌ర‌క‌లాన్ వేదిక‌పై మాత్రం…ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ఉన్న‌ట్టుగా ప్ర‌వ‌ర్తించారు.

TRS Pragati nivedna, counter Congress

తాను చెప్పాల‌నుకున్న‌ది సూటిగా చెప్ప‌లేక‌పోయారు. త‌న భావాన్ని స్ప‌ష్టంగా వ్య‌క్తీక‌రించ‌లేక‌పోయారు. త‌న పాల‌న‌పైనా, టీఆర్ ఎస్ బ‌లంపైనా, ఎన్నిక‌ల్లో గెలుప‌పైనా త‌న‌కు పూర్తి విశ్వాసం ఉంటే..కేసీఆర్ మాటల్లోనూ, చేతల్లోనూ అది ప్ర‌తిఫ‌లించేద‌ని, భారీ జ‌న‌సందోహం మ‌ధ్య భ‌విష్య‌త్ రాజ‌కీయ కార్యాచ‌ర‌ణ‌పై విస్ప‌ష్ట ప్ర‌క‌ట‌న చేసి ఉండేవార‌ని, కానీ రాష్ట్రంలో మ‌రోసారి గెలుపొంద‌డంపై ఏ కార‌ణం చేత‌నో కేసీఆర్ లో న‌మ్మ‌కం సన్న‌గిల్లింద‌ని, ముంద‌స్తుపై ఆయ‌న వెనుకంజ వేస్తున్నార‌ని, ప్ర‌గ‌తినివేద‌న స‌భ‌లో అందుకే ఆయ‌న భ‌యాందోళ‌న‌గా క‌నిపించార‌ని కొంద‌రు విశ్లేషిస్తున్నారు. కొంగ‌ర‌క‌లాన్ కు 25ల‌క్ష‌ల‌కు పైగా జ‌నం త‌ర‌లిరావాల‌ని కేసీఆర్ కోరుకుంటే అందులో స‌గం మంది కూడా స‌భ‌కు రాలేద‌ని, ఏరియ‌ల్ వ్యూ ద్వారా ఈ విష‌యం గ‌మ‌నించిన ముఖ్య‌మంత్రికి నిస్స‌త్తువ ఆవ‌రించింద‌ని, అదే స‌భ‌లో కేసీఆర్ నిస్సార ప్ర‌సంగానికి కార‌ణ‌మ‌ని, అలాగే సెంటిమెంట్ల‌ను బాగా న‌మ్మే కేసీఆర్ కొంగ‌ర‌క‌లాన్ వ‌ద్ద ఏర్పాటుచేసిన త‌న భారీ ఫ్లెక్సీ శనివారం రాత్రి కూలిపోవ‌డాన్ని పెద్ద అశుభంగా భావిస్తున్నార‌ని, సోష‌ల్ మీడియా కూడా ఫ్లెక్సీ ఘ‌ట‌న‌పై తీవ్రంగా స్పందించ‌డం కేసీఆర్ ను క‌ల‌వ‌ర‌పెడుతోంద‌ని, అందుకే స‌భ‌లో కేసీఆర్ అన్య‌మ‌న‌స్కంగా ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. స‌భ త‌ర్వాత తెలంగాణ‌లో ముంద‌స్తు లేన‌ట్టే అని కొందరు తేల్చేస్తున్నారు.

KCR

ముఖ్యంగా కాంగ్రెస్ నేత‌లు అదే ప‌నిగా ఈ ప్ర‌చారం చేస్తున్నారు. స‌భ అట్ట‌ర్ ఫ్లాప్ అయింద‌ని, ఇక ముంద‌స్తుకు వెళ్లే సాహ‌సం కేసీఆర్ చేయ‌ర‌ని వారు అంచ‌నావేస్తున్నారు. స‌భ‌లో కొత్త ప‌థ‌కాలేవీ ప్ర‌క‌టించ‌కపోవడానికి కార‌ణం కేసీఆర్ ముంద‌స్తు వ‌ద్ద‌నుకోవ‌డ‌మేనన్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ముంద‌స్తు గురించి స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేయ‌కుండా…అంద‌రూ నిర్ణ‌యం తీసుకునే బాధ్య‌త‌ను త‌న‌కే వ‌దిలేశార‌ని కేసీఆర్ చెప్ప‌డం ద్వారా…ముంద‌స్తు ప్ర‌య‌త్నం జ‌రిగింది కానీ…తాను ఈ ఆలోచ‌న‌పై వెన‌క్కి త‌గ్గాన‌ని తెలియ‌జేశార‌ని విశ్లేషిస్తున్నారు. స‌ర్వం సిద్ధం చేసుకుని ముంద‌స్తుపై కేసీఆర్ వెన‌క్కి త‌గ్గ‌డానికి కారణం ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీనే అని, కేసీఆర్ తో స్నేహంగా ఉన్న‌ట్టు న‌టిస్తూ…ఆయ‌న అసెంబ్లీ, ప్ర‌భుత్వం ర‌ద్దుచేసేదాకా ఎదురుచూసి, వెంట‌నే కేంద్ర ఎన్నిక‌ల సంఘంతో ముంద‌స్తుపై వ్య‌తిరేక ప్ర‌క‌ట‌న చేయించి, తెలంగాణ‌లో గ‌వ‌ర్న‌ర్ పాల‌న ఏర్పాటుచేయాల‌ని మోడీ, షా భావించార‌ని, ఈ ఎత్తుగ‌డ గ‌మ‌నించే కేసీఆర్ అప్ర‌మ‌త్త‌మ‌య్యార‌ని,  ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌లో జోనల్ విధానం గురించి మాట్లాడుతూ మోడీని తాను చేస్త‌వా…ఛ‌స్త‌వా అని అడిగాన‌ని వ్యాఖ్యానించ‌డం ఇందులో భాగ‌మేన‌ని తెలుస్తోంది.

KCR, Modi, meeting, New Delh

ముంద‌స్తుకు వెళ్లాల‌న్న త‌న ప్ర‌య‌త్నం స‌ఫ‌లీకృతం కాక‌పోవ‌డం, ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త బాగా ఉంద‌న్న క‌చ్చిత‌మైన స‌మాచారం అంద‌డం వ‌ల్లే కేసీఆర్ చివ‌రి నిమిష‌యంలో ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌ను లైట్ తీసుకున్నార‌ని, నిరాసక్తంగా ప్ర‌సంగించి వెళ్లిపోయార‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి ఎప్పుడూ మాట‌ల తూటాలు పేలుస్తూ ప్ర‌త్య‌ర్ధులను నోరెత్త‌నీకుండా చేసే కేసీఆర్ ప్ర‌గ‌తి నివేద‌న స‌భ   నిస్సార ప్ర‌సంగంతో….త‌న‌పై విమ‌ర్శ‌లు కురిపించే అవ‌కాశాన్ని త‌న‌కు తానుగా  వారికి ఇచ్చార‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.  

Related posts

ప్రాధేయపడ్డా..ప్రాణాలు తీశారు!

madhu

ఆసియన్ గేమ్స్ లో భారత్ ఖాతా తెరిచింది…

chandra sekkhar

మూర్తి మృతదేహం రావడానికి మరో మూడు రోజులు!

madhu

Leave a Comment