• Home
  • వార్తలు
  • ఇద్దరు సిట్టింగులకు కేసీఆర్ షాక్..ఓదేలు, బాబూ మోహన్‌కు టికెట్‌ నిరాకరణ
రాజకీయ వార్తలు వార్తలు

ఇద్దరు సిట్టింగులకు కేసీఆర్ షాక్..ఓదేలు, బాబూ మోహన్‌కు టికెట్‌ నిరాకరణ

Why did KCR shock the two sitting MLAs

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే 105 మంది అభ్యర్థుల జాబితాను తెలంగాణ రాష్ట్ర సమితి ప్రకటించింది. ఇద్దరికి మాత్రమే టికెట్‌ నిరాకరించామని, మరో ఐదుగురిని సిట్టింగ్‌ అభ్యర్థుల టికెట్లను పెండింగ్‌లో ఉంచామని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ..చెన్నూరు నుంచి ప్రస్తుతం సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న ఓదేలుకు ఈ సారి టికెట్‌ నిరాకరించారు. ఆయన స్థానంలో ప్రస్తుతం ఎంపీగా ఉన్న బాల్కసుమన్‌ను బరిలోకి దించుతున్నట్లు కేసీఆర్‌ వెల్లడించారు. మరోవైపు అందోల్‌ నుంచి బాబూ మోహన్‌ స్థానంలో స్థానంలో ప్రముఖ జర్నలిస్టు నాయకుడు చంటి క్రాంతికిరణ్‌కు అవకాశం కల్పించారు.

దీంతో తెలంగాణ జర్నలిస్టు ఫోరం తరఫున ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న జర్నలిస్టు నాయకుడికి అవకాశం దక్కినట్టు అయింది. ఎలక్ట్రానిక్‌ మీడియా రంగంలో ఉన్న క్రాంతికుమార్‌ పలు టీవీ చానెళ్లలో పని చేశారు. ఇక, మరో విద్యార్థి నాయకుడు పిడమర్తి రవి సత్తుపల్లి నుంచి మరోసారి అవకాశం ఇచ్చారు. క్రాంతి కిరణ్‌ను బరిలోకి దించుతున్నారు. తెలంగాణ కోసం తెరాస ఇప్పటి వరకు ఎన్నో త్యాగాలు చేసింది. తెలంగాణకు అవసరమైన ప్రతిసారీ ప్రతి సందర్భంలోనూ రాజీనామాలు చేసి విసిరేశాం. ఇప్పుడు కూడా అదేవిధంగా మరోసారి త్యాగానికి సిద్ధపడ్డాం. రాష్ట్రం బాగు కోసం అసెంబ్లీ రద్దు చేశాం. మరో ఐదుగురు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉందని కేసీఆర్‌ చెప్పారు.

Related posts

ముంద‌స్తు కేసీఆర్ క‌ల‌లు నెర‌వేర్చేనా….?

chandra sekkhar

అధికారం పోతే బతకడమెలా..అనే ఆందోళనలో కేసీఆర్: కోదండరామ్‌

madhu

దసరాకు ప్రత్యేక రైలు…

jithu j

Leave a Comment