Trending Today రాజకీయ వార్తలు వార్తలు సమీక్ష వార్తలు సామాజిక

అసంతృప్తితో ఉన్న నాయకులకు…స్వయంగా కేసీఆర్.. బుజ్జగింపులు…

kcr meeting with unhappy leaders of trs

తెలంగాణాలో ముందస్తుకు సిద్ధం అయిన కేసీఆర్ ప్రచారం కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. కానీ అసెంబ్లీ రద్దు అయిన వెంటనే తన పార్టీ తరపున అభ్యర్థుల పేర్లు కూడా ప్రకటించడం కేసీఆర్ కు ఇప్పుడు పెద్ద తలనొప్పిగా పరిణమించింది. పార్టీలో టికెట్ రానివారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఆశలతో తెరాస లోకి వచ్చిన వారు నిరాశతో సొంతగూటికి చేరే ప్రయత్నాలలో ఉన్నారు. ఇక అసంతృప్తి తెరాస లో పెద్ద తుఫానే తెచ్చేట్టుగా ఉంది. అందుకే మొన్నటి దాకా కేటీఆర్… ఇప్పుడు ఏకంగా కేసీఆర్ వారిని బుజ్జగించే పనిలో హడావుడిగా ఉన్నారు.

కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేశాక వెంటనే 105 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మొదటి విడతలోనే తమ పేర్లు ఎందుకు రాలేదని కొందరు, అసలు తమకు టికెట్ వట్టేట్టుగా లేదని కొందరు.. ఇలా కేసీఆర్ ముందస్తు ఎన్నికల కోసం ముందుగా ప్రకటించిన అభ్యర్థుల వివరాలు.. పార్టీకి ముసలంగా తయారయ్యే అవకాశాలు భేషుగ్గా కనిపిస్తున్నాయి. వారందరిని వాయించడం కష్టం, ముందుగా విడుదల చేసిన జాబితాను మార్చినా కష్టమే… మొత్తానికి తాను తీసిన గోతిలో తానే పడ్డ చందాన కేసీఆర్ పరిస్థితి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

తాజాగా తెరాస నేత నల్లాల ఓదెలు కూడా తీవ్రఅసంతృప్తితో ఉండటంతో స్వయంగా కేసీఆర్ తన కార్యాలయానికి పిలిపించుకొని మరీ బుజ్జగించినట్టు తెలుస్తుంది. అయితే తనకు చెన్నూరు టికెట్ కావాలని ఓదెలు పట్టుదల.. కానీ కేసీఆర్ బుజ్జగించాక తన నిర్ణయం మార్చుకున్నట్టుగా ఉంది.. అందుకే పార్టీ అధిష్టానం చెప్పినట్టు వింటాను, చెన్నూరులో ఎవరిని నిలబెడితే వారిని గెలిపించడానికి కృషి చేస్తాను అని చెపుతున్నారు ఓదెలు. ఈ స్థానంలో తెరాస గెలవాలని పట్టుదలతో ఉండటంతో అక్కడ సముచితమైన వారికి టికెట్ ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించినట్టు సమాచారం.

Related posts

గాలి జనార్దన్ రెడ్డి బళ్లారి బరిలో..?

admin

నవ్యాoధ్ర లో విద్యుత్ ఛార్జీలు తగ్గే అవకాశం ?

admin

మహారాష్ట్రలో ఉద్రిక్తత.. ఒకరు మృతి..

admin

Leave a Comment