telugu navyamedia
news political Telangana trending

హైదరాబాద్‌ : … కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె.. కేసీఆర్ సమీక్ష..

kcr meeting on tsrtc protest report

సమ్మె పై హైకోర్టు వరుస విచారణల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఆర్టీసీపై మరోమారు సమీక్ష నిర్వహించారు. ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఈ సమీక్ష సమావేశానికి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌, సీఎస్‌ ఎస్కే జోషి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌, ఆర్టీసీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. కార్మిక సంఘాల డిమాండ్లను పరిశీలించి త్వరగా పరిష్కరించాలన్న హైకోర్టు సూచన నేపథ్యంలో తదుపరి అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చిస్తున్నారు.

ప్రైవేట్ బస్సులకు రవాణా అనుమతుల విషయంలోనూ ముందుకెళ్లరాదన్న ఉన్నత న్యాయస్థానం ఆదేశాలపైనా సమీక్షలో చర్చిస్తున్నారు. రెండు తీర్పులకు సంబంధించిన తీర్పు ప్రతులను అధ్యయనం చేయడంతో పాటు కోర్టు ప్రస్తావించిన అంశాలపై ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. న్యాయస్థానం ముందు ప్రభుత్వం తరపున వినిపించాల్సిన వాదనలపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.

Related posts

జమ్మూకాశ్మీర్ లో .. మహారాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడులు.. మొదటి రాష్ట్రం కూడా..

vimala p

మార్కెట్ లో బంగారం ధరలు..

vimala p

తెలంగాణ అంటే నాకు చాలా ఇష్టం.. తానా మ‌హాస‌భ‌లో పవన్

vimala p