telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆర్టీసీ కార్మికులకు .. కేసీఆర్ వరాలు .. మృతుల కుటుంబాలకు ఉద్యోగం..

kcr meet with rtc and all set fine

ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ ఆత్మీయ సమావేశం ఆద్యంతం ఉద్వేగ భరితంగా జరిగింది. దాదాపు రెండు గంటల పాటు సాగిన సీఎం ఆత్మీయ ప్రసంగం.. అత్యంత మానవీయ కోణంలో సాగింది. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి చాలా సానుకూలంగా స్పందించారు. సభలో ప్రతి ఒక్కరి కన్నుల్లో ఆనంద భాష్పాలు నింపాయి. మధ్యమధ్యలో సీఎం విసిరిన ఛలోక్తులు సందర్భోచిత సామెతలు సమావేశంలో ఉన్న ప్రతివొక్కరిని కడుపుబ్బ నవ్వించాయి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఓ పిట్టకథ చెప్పారు. ప్రతి పని చేసేటప్పుడు చెడగొట్టేవాళ్ళు ఉంటారని చెబుతూ ముఖ్యమంత్రి రామాయణ యుద్ధం గురించి ప్రస్తావించి ఆర్టీసీ ఉద్యోగులను కడుపుబ్బ నవ్వించారు .

యుద్ధంలో రామబాణం వల్ల అర్ధాయుష్షుతో మరణించిన రాక్షసులు కొందరు తమ పరిస్థితి ఏమిటని రాముణ్ణి అడిగినప్పుడు కలియుగంలో మీరు అక్కడక్కడా పుట్టండి అంటారు. అలా పుట్టిన వారే మనుషులను పీక్కుతింటున్నారు. వారే ఆర్టీసీలో అందరినీ ఇబ్బంది పెడుతున్నారు.. అంటూ ముఖ్యమంత్రి పేర్కొనడంతో సమావేశంలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. భోజన సమయంలో కార్మికుల కష్ట సుఖాలు తెలుసుకున్న సీఎం ప్రగతి భవన్ లో ఆర్టీసీ ఉద్యోగులతో భోజనం చేసే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ డ్రైవర్లు , కండక్టర్ల తో ఆత్మీయంగా మాట్లాడి వారి కష్ట సుఖాలను తెలుసుకున్నారు. సీఎం చాలా ఆప్యాయంగా పలకరించడంతో మహిళా కండక్టర్లు తమ సమస్యలను వివరించారు. సీఎంకు ఎంతో చొరవగా తమ కష్ట సుఖాలను చెప్పుకొన్నారు.

Related posts