telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆఖరిరోజూ .. ప్రతిపక్షాలపై ధ్వజమెత్తిన .. కేసీఆర్..

another congress mla into trs

నేటి అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడుతూ బీజేపీ ఏమీ ఇవ్వకపోగా తెలంగాణ రాష్ట్రాన్ని అవమానిస్తోందన్నారు. తల్లిని చంపి బిడ్డను బతికించారన్న మాటలు మోదీ మానుకోవాలన్నారు. తెలంగాణ ఏర్పాటు డార్క్‌ డే అని అమిత్ షా అన్నారని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపర్చడం సరికాదని సీఎం అన్నారు. 60 ఏళ్లు పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నామని, రాష్ట్రాన్ని ఎవరూ దానంగా ఇవ్వలేదని కేసీఆర్‌ పేర్కొన్నారు. దుర్మార్గాలకు బ్రీడింగ్‌ సెంటర్‌ కాంగ్రెస్సేనని కేసీఆర్‌ విమర్శించారు. మహిళల అక్రమ రవాణా, డ్రగ్స్‌ దందాలు ఎవరి హయాంలో జరిగాయో తెలుసుకోవాలని కేసీఆర్ అన్నారు. తెలంగాణ వచ్చినా కాంగ్రెస్‌ నేతలు కుట్రలు ఆపడం లేదని, ప్రాజెక్టులు, ఉద్యోగాల నోటిఫికేషన్లపై కేసులు వేశారన్నారు. తెలంగాణ ఇచ్చి తప్పు చేశామని మాట్లాడడం సరికాదన్నారు. సరిహద్దు మహారాష్ట్ర ప్రజలు తెలంగాణలో కలుస్తామంటున్నారని, బీజేపీ ప్రభుత్వం కంటే టీఆర్‌ఎస్‌ పాలన గొప్పగా ఉందని సీఎం పేర్కొన్నారు. కిసాన్‌ సమ్మాన్‌ కంటే రైతుబంధు ఎన్నో రెట్లు ఉపయోగమని అన్నారు. ఆయుష్మాన్‌ కంటే ఆరోగ్య శ్రీ పథకం చాలా ప్రయోజనకరమని కేసీఆర్‌ పేర్కొన్నారు.

ఉద్యోగాల డిమాండ్ తప్పు అనడం లేదని, ఇంటికో ఉద్యోగం అనడం సరికాదని, యువతను రెచ్చగొట్టొద్దని ఆయన సూచించారు. ఇంకో రెండు, మూడు పథకాలు ఉన్నాయని, అవి తీసుకొస్తే రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఇక ఉండదన్నారు. మరో మూడు టర్మ్‌లు టీఆర్‌ఎస్‌దే అధికారమని కేసీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. వీఆర్వోల తొలగింపుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కేసీఆర్‌ అన్నారు. వీఆర్వోలను తొలగించాల్సి వస్తే తొలగిస్తామన్నారు. పటేల్‌, పట్వారీ వ్యవస్థను తొలగించలేదా? అని ప్రశ్నించారు. దేశం గర్వపడేలా రెవెన్యూ చట్టం తీసుకొస్తామన్నారు. పట్టా పుస్తకంలో అనుభవదారు కాలమ్‌ తొలగించాలని చెప్పానని, కౌలుదారులను గుర్తించబోమని చెప్పామన్నారు. కౌలు అంటే రైతు, భూమి చేసే వ్యక్తి మధ్య ఒప్పందమేనని.. భూమికే ఎందుకు అనుభవదారు రాస్తారని.. ఇళ్లు, భవనాల విషయంలో ఎందుకు రాయరని కేసీఆర్‌ ప్రశ్నించారు. ఈ ఏడాది ఆర్థికమాంద్యం ప్రభావం తీవ్రంగా ఉందని, అన్ని రంగాలపై ఆర్థికమాంద్యం ప్రభావం తీవ్రంగా ఉందని కేసీఆర్ అన్నారు. రాష్ట్రాల బడ్జెట్‌ కేంద్రంపై ఆధారపడి ఉందని, కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపుతో ఆదాయం తగ్గుతుందన్నారు. భూముల అమ్మకంపై ఆశాజనకంగా ఉన్నామని కేసీఆర్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Related posts