telugu navyamedia
రాజకీయ వార్తలు

కేసీఆర్‌ ఫెడరల్ ఫ్రంట్‌కు స్టాలిన్‌ బ్రేక్!

stalin kcr

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్, కుమారస్వామితో పాటు పలువురు నేతలను కలిశారు. ఫ్రంట్ ఏర్పాటు విషయమై డీఎంకె చీఫ్ స్టాలిన్‌తో సోమవారం సాయంత్రం కేసీఆర్ మరోసారి భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఈరోజు మీడియాతో స్టాలిన్ మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు లేని మూడో ఫ్రంట్ ఏర్పడుతుందని తాను భావించడం లేదని అన్నారు. మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతే ఫ్రంట్ పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ చెన్నైకి రాలేదని స్టాలిన్ తెలిపారు. తమిళనాడులోని పలు ఆలయాల సందర్శనకు ఆయన వచ్చారని చెప్పారు. ఈ నేపథ్యంలో, మర్యాదపూర్వకంగా కలుద్దామని తన అపాయింట్ మెంట్ కోరారని తెలిపారు.మరోవైపు డీఎంకే అధికార ప్రతినిధి శరవణన్ నిన్న మీడియాతో మాట్లాడుతూ, రాహుల్ గాంధీనే తమ ప్రధాని అభ్యర్థి అని స్టాలిన్ ఇప్పటికే స్పష్టం చేశారని తెలిపారు. కేసీఆర్‌తో చర్చల విషయంలో స్టాలిన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో తన పార్టీని బలోపేతం చేసుకొనేందుకు పావులు కడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో థర్ట్‌ఫ్రంట్‌ ఆలోచనకు తావు లేదని స్టాలిన్ స్పష్టం చేశారు.

Related posts