telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులో కొనసాగించాలి: కేసీఆర్

KCR cm telangana

తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ నిన్న రాత్రి పది గంటల వరకూ తన కార్యాలయంలోనే ఉండి పరిస్థితిని సమీక్షించారు. సీనియర్ అధికారులు, కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడి ఆయా ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.రాష్ట్రంలో లో లాక్ డౌన్ విజయవంతంగా అమలు అవుతోందని, ఇందుకు అందరు అధికారులు, పోలీసు వ్యవస్థకు అభినందనలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.

భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ పక్కాగా అమలు చేయాలని కేసీఆర్ ఆదేశించారు. వైరస్ వ్యాపించకుండా ఉండాలంటే, ప్రజల్లో మరింత అవగాహన పెంచాలని, సామాజిక దూరాన్ని పాటించడమే మన ముందున్న ఉత్తమ మార్గమని ఈ సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చిన వారు, వారితో సన్నిహితంగా ఉన్న వారి విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్న వారిని మరింత జాగ్రత్తగా కనిపెట్టాలని అన్నారు. రాత్రి పూట కర్ఫ్యూ విజయవంతం అవుతుండటం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు.

Related posts