telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆరోగ్యశ్రీని కాపికొట్టి ‘ఆయుష్మాన్‌ భారత్‌’: కేసీఆర్‌

KCR Cabinet Chance News MLAs

తెలంగాణ రాష్ట్రంలో అమల్లో ఉన్న ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్నే కాపీ కొట్టి కేంద్రం ఆయుష్మాన్‌ భారత్‌ పథకం తీసుకొచ్చారని సీఎం కేసీఆర్‌ విమర్శించారు.మిర్యాలగూడలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద కేంద్రం ఇచ్చేది చాలా తక్కువని, దానికంటే మెరుగ్గా ఆరోగ్యశ్రీ ఉన్నందునే తాను తిరస్కరించానని చెప్పారు. ఈ రెండింటిలో ఏది గొప్పదో చర్చకు రావాలని సవాల్‌ విసిరారు.

సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూనే కేంద్రంలో భాజపా, కాంగ్రెస్‌ పార్టీల పాలనపై ధ్వజమెత్తారు. తాను కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో 11 సార్లు సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిగాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులు, దళితులు, గిరిజనులు, ముస్లిం మైనార్టీలు, బీసీలకు మోదీ ఏమైనా చేశారా? అని నిలదీశారు. మోదీ ఐదేళ్ల పాలనలో ఏం చేశారో ప్రజలు ఆలోచించాలని పేర్కొన్నారు.

Related posts