telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

ఈనెల 17న కేసీఆర్ పుట్టిన రోజు..జలవిహార్‌లో ఘంగా ఏర్పాట్లు!

KCR Fire to Congress MLA Gandra
ఈనెల 17న తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు టీఆర్ఎస్ ఏర్పాట్లు చేస్తోంది. జలవిహార్‌లో సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల ఏర్పాట్లను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోమాలు, యజ్ఞాలు, కేసీఆర్ చిన్ననాటి విశేషాలతో కూడిన ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 
కళాకారులతో వివిధ కళారూపాల ప్రదర్శన ఉంటుందన్నారు. ఈ వేడుకలకు కేటీఆర్, హరీష్, కవిత ముఖ్య అతిథులుగా హాజరు అవుతారన్నారు.  కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఎంపీ కవిత  చీరల పంపిణీ చేయనున్నట్లు  తలసాని వెల్లడించారు. సీఎం కేసీఆర్‌పై రూపొందించిన రెండు పాటలను విడుదల చేస్తామన్నారు.  తెలంగాణ కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తలసాని  తెలిపారు.

Related posts