telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయండి: కేసీఆర్

Kcr telangana cm

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లును రాజ్యసభలో వ్యతిరేకించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ తమ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. రైతు లోకానికి తీవ్ర అన్యాయం చేసే ఈ బిల్లును రాజ్యసభలో గట్టిగా వ్యతిరేకించాలని ఎంపీ కె.కేశవరావును సీఎం కేసీఆర్ ఆదేశించారు.

రైతులు తమ సరుకును దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చంటూ బిల్లులో చెబుతున్నారని తెలిపారు. రైతులు తమకున్న కొద్దిపాటి సరుకును ఎన్నో రవాణా ఖర్చులు భరించి లారీల ద్వారా వేరే చోటుకు తీసుకెళ్లి అమ్మడం సాధ్యమయ్యే పనేనా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఈ బిల్లు తేనె పూసిన కత్తి లాంటి చట్టం అని అన్నారు. దీన్ని కచ్చితంగా వ్యతిరేకించాలని స్పష్టం చేశారు.

ప్రస్తుతం మక్కల (మొక్కజొన్న) దిగుమతిపై 50 శాతం సుంకం అమలులో ఉందని, దీనిని 15 శాతానికి తగ్గించి కోటి టన్నుల మక్కలు దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఇప్పటికే 75 లక్షల టన్నులు కొనుగోలు చేసిందని, భారీగా సుంకం తగ్గించడం ఎవరి ప్రయోజనం కోసం చేసిందని కేసీఆర్ నిలదీశారు.

Related posts