telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెరపైకి .. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ .. 8 మందికి ఉద్వాసన తప్పదా.. !

KCR cm telangana

కేసీఆర్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఇప్పట్లో ఉండదు అన్న నిర్ధారణకు చాల మంది వచ్చేశారు. కానీ పరిస్థితులు వేరేలా ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. బడ్జెట్ సమావేశాలు ముందుండడం.. అప్పటికే జాప్యం జరగడం వాళ్ళ ఎవరినీ నొప్పించకుండా.. వీలైనంతగా కుల, మత సమీకరణాలు చూసుకుని.. ఎలాంటి అసమ్మతులు, అసంతృప్తులు లేకుండా అత్యంత వ్యూహాత్మకంగా కేసీఆర్ కేబినెట్ విస్తరణని పూర్తి చేశారు. అనుకున్నట్టుగానే బడ్జెట్ సెషన్ ప్రశాంతంగా ముగించుకోబోతున్నారు. అయితే కేబినెట్ విస్తరణ అంశం క్లోజ్ అయినట్టే అనుకునే వారికీ కేసీఆర్ షాక్ ఇవ్వబోతున్నట్టు సమాచారం.

దసరా తర్వాత కేబినెట్ లో తీసివేతలు, కూడికలు ఉండబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల భోగట్టా. అయితే ఈ సారి వేటు పడే వారి సంఖ్య దాదాపు 8 వరకు ఉంటుందని తెలుస్తోంది. అంటే ప్రస్తుతం ముఖ్యమంత్రి తో కలిపి ఉన్న 18 మంత్రుల నుంచి ఎనిమిది మందికి ఉద్వాసన పలికి వారి స్థానంలో మరో ఎనిమిది మందికి అవకాశం ఇచ్చేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల మంత్రి వర్గ విస్తరణకు ముందు ఈటల రాజేందర్ వాటి నేతలపై వేటు పడడం ఖాయం అన్న సంకేతాలు రావడం, దాంతో అయన వ్యూహాత్మకంగా కొన్ని కామెంట్లు చేయడం.. దానికి తెలంగాణ వ్యాప్తంగా భారీ స్పందన రావడం తెలిసిందే.

దసరా నవరాత్రులు, విజయదశమి ఉత్సవాలు పూర్తి అవుతూనే కేబినెట్ ని పునర్వ్యవస్థీకరించాలని కేసీఆర్ భావిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. అయితే సీఎం కోటరీలోనే మరో వర్గం మాత్రం ఆరు నెలల వరకు కేబినెట్లో మార్పులు, చేర్పులపై కేసీఆర్ దృష్టి పెట్టరు అని వాదిస్తోంది. కానీ, విశ్వసనీయ వర్గాల ప్రకారం.. దసరా తర్వాత కేబినెట్ నుంచి ఆరు నుంచి ఎనిమిది మందికి ఉద్వాసన పలికి.. వారి స్థానాల్లో తగిన వారికి అవకాశం కల్పిస్తారని తెలుస్తుంది.

Related posts