telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ గొప్ప పథకం: కేసీఆర్

cm kcr red signal to 3 sitting mps

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభించిన ఆరోగ్యశ్రీ చాలా గొప్పదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కితాబిచ్చారు. తెలంగాణ అసెంబ్లీ నాలుగో రోజు సమావేశాల్లో భాగంగా గవర్నర్‌ ప్రసంగంపై చేపట్టిన ధన్యవాద తీర్మానంపై ఆయన ప్రసంగించారు. గొప్ప పథకాలు ఎవరు తెచ్చినా మెచ్చుకోవాల్సిందేనని చెప్పారు. కేంద్రం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ను తాము అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ఆరోగ్యశ్రీ చాలా మంచి పథకమని చెప్పారు. అందుకే దాన్ని మరింత మెరుగు పరిచి తమ ప్రభుత్వం కూడా ఆరోగ్యశ్రీని అమలు చేసిందన్నారు. ఈ పరిస్థితుల్లో తమకు ఆయుష్మాన్ భారత్ అవసరం లేదని మోదీకి చెప్పానని కేసీఆర్ తెలిపారు. 108 అంబులెన్స్ పథకం కూడా చాలా బాగుందని ఆయన అన్నారు. ఆరోగ్యశ్రీ బాగున్నందునే కేంద్రం అమలు చేస్తున్నఆరోగ్య పథకంలో తెలంగాణ చేరలేదని స్పష్టం చేశారు.

Related posts