telugu navyamedia
political Telangana trending

నిజామాబాద్ లో .. ప్రచారపోరాటం చేస్తున్న కవిత..

kavita campaign in nijamabad

తెరాస లోక్‌సభ అభ్యర్థి ఎంపీ కవిత నిజామాబాద్‌ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పసుపు బోర్డుపై కేంద్ర మంత్రులకు అనేక వినతిపత్రాలు సమర్పించామని తెలిపారు. పసుపు బోర్డుపై లోక్‌సభలో ప్రైవేటు బిల్లు కూడా ప్రవేశ పెట్టామని చెప్పారు. తెలంగాణ వచ్చాక రాష్ట్ర ప్రజలు కేసీఆర్‌ను నమ్మి ఆయనకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారన్నారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే 24గంటల కరెంటు ఇస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ స్పీకర్‌ సురేశ్‌రెడ్డి, రైతు ఉద్యమ నాయకుడు కె.నరసింహనాయుడు, డాక్టర్‌ మధుశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Related posts

మందు బాబులకు మద్దతుగా బాలీవుడ్ నటుడు రిషి కపూర్

vimala p

ఆర్జీవీ బయోపిక్ కు సన్నాహాలు… వర్మగా బీహార్ వ్యక్తి…!?

vimala p

తొలిప్రేమలో .. పాటకు రీమేడ్‌ .. పవన్ చేతులమీదుగా విడుదల…

vimala p