telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

ఎమ్మెల్సీ గా కవిత…!మొత్తానికి కుటుంబం అంతా పదవులలో ఉండాల్సిందే.. !!

kavita campaign in nijamabad

రాష్టం లో త్వరలోనే మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్న నేపధ్యం లో కవితకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి మంత్రి వర్గం లోకి తీసుకుని, రాష్ట్ర ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించాలని అంటున్నారు. నిజామాబాద్ లోక్ సభ స్థానం లో కవిత ఓటమి కి కుమ్మక్కు రాజకీయాలే కారణమని భావిస్తోన్న టీఆరెస్ నాయకత్వం, ప్రతిపక్ష పార్టీల ఎత్తుగడను తిప్పికొట్టేందుకు కవిత ను మంత్రివర్గం లోకి తీసుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రి త్వరలోనే మంత్రి వర్గాన్ని విస్తరించే అవకాశాలున్న నేపధ్యం లో కవితను మంత్రివర్గం లోకి తీసుకోవాలన్న ప్రతిపాదన టీఆరెస్ వర్గాల నుంచి తెరపైకి రావడం వ్యూహాత్మక ఎత్తుడగానే భావించాల్సిదేనని, అంత ఆషామాషీగా చేస్తోన్న ప్రతిపాదన ఏమి కాదని పేర్కొంటున్నారు.

హరీష్ రావు ను ముఖ్యమంత్రి తన మంత్రివర్గం లోకి తీసుకునే అవకాశాలు ఎంతమాత్రం కన్పించడం లేదు, కేటీఆర్ ను కాదని హరీష్ కు మంత్రి పదవి కట్టబెడితే ఆయన కీలక పవర్ సెంటర్ ఎదిగే అవకాశాలున్నాయని టీఆరెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందుకే ఇరువురికి మంత్రి వర్గ విస్తరణ లో పదవి కట్టబెట్టకపోతే, తమ కుటుంబ సభ్యురాలి హోదా లో కవిత కు కేసీఆర్ అవకాశం కల్పించిన పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ప్రస్తుతం మంత్రివర్గం లో మహిళా మంత్రి లేకపోవడం కూడా కవితకు కలిసొచ్చే అంశమని అంటున్నారు. పార్టీ వర్గాల నుంచి వెల్లువెత్తుతోన్న తాజా డిమాండ్ తో టీఆరెస్ లోని సీనియర్ మహిళా శాసనసభ్యురాలు ఆందోళన చెందుతున్నారు. ఇన్నాళ్లూ మంత్రి వర్గ విస్తరణ లో తమకు అవకాశం దక్కుతుందేమోనని ఆశించిన వారికి, ప్రస్తుత పరిణామాలు ఏమాత్రం మింగుడు పడడం లేదు . ఒకవేళ ముఖ్యమంత్రి తన కుమార్తె ను మంత్రి వర్గం లోకి తీసుకోవాలని భావిస్తే, ఇతర మహిళ ఎమ్మెల్యేలకు మంత్రి వర్గం లో చోటు దక్కే అవకాశాలు ఉండకపోవచ్చునని ఆందోళన చెందుతున్నారు. ఇన్ని ఇబ్బందుల మధ్య కవితకు పదవి కట్టబెడతారా.. చూడాల్సిఉంది.

Related posts