telugu navyamedia
తెలుగు కవిత్వం సామాజిక

కవి హృదయం

mana prema poetry corner

శీర్షిక… కాలేకాలం

తను కాలే కట్టెను
తనను కాల్చే కట్టెలనూ
కట్టగా ఉంటే కదిలించలేని
మోపుగా కట్టిన కట్టెలను
తనకాళ్లపై తాను నిలిచేందుకు
తలమీదుంచుకు తరలుతున్నావా తల్లీ
నిను కాదన్నవాళ్లూ కాలదన్నిన
వాళ్లూ, కడుపునబుట్టినా
కలిగంజైనా నీకు కాచిపోయలేని కరుడుగట్టిన
కఠినులకన్నా…
అడవిలోబుట్టినా పొయ్యిలో
కాలుతూ మనకడుపునింపీ
పోయాక చితిపానుపై మనను
పవిత్రులు గా చేసిపరలోకం
పంపుతూ తాము బూడిదై
పోయే ఈ నిస్వార్ధపు కట్టెలు
చెప్పే కఠోర వాస్తవం
ఈకలికాలంలో ఎవరు వింటారూ…
కడుపులో కాళ్లు దూర్చుకుని
ఆకలార్చుకుంటూ
కన్నబిడ్డలు నిరాదరించినా
ధృఢమైన కట్టెలా తానే
తన పోషణ కోసం గుండెను
పాషాణం గా చేసుకున్న
ఓ శ్రమతల్లీ నీకు వందనం
పాదాభివందనం…🙏🌹🙏

ఈ చిత్రానికి నాగాత్రం కలం
రచన..డా.కోడూరుసుమన

Related posts