వార్తలు సామాజిక సినిమా వార్తలు

కౌశల్ ఆర్మీ నిజం కాదు… బాబు గోగినేని

బిగ్‌బాస్ షో నుండి ఎలిమినేట్ అయిన హేతువాది బాబు గోగినేని కౌశల్ ఆర్మీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ ఛానల్ చర్చాకార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కౌశల్ ఆర్మీ అభిమానులతో ఏర్పడింది కాదని, దాన్ని క్రియేట్ చేశారి, ఇన్వెస్టిగేషన్ చేస్తే వారి బండారం మొత్తం బయట పడుతుందన్నారు. ఈ సందర్భంగా కౌశల్ ఆర్మీ చేస్తున్న కొన్ని పనులను ఆయన తప్పుబట్టే ప్రయత్నం చేశారు. ఇప్పటికైనా వారు తమ ధోరణి మార్చుకోవాలని సూచించారు.

బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంటరవ్వడం అంటే మనం మన రెప్యూటేషన్ ఇంకొకరి చేతికి అప్పజెప్పడం. అది కొన్నిసార్లు డామేజింగ్‌గా ఉంటుంది. నేను చూసినంత వరకు తేజస్వికి చాలా డ్యామేజ్ జరిగింది. దీప్తి సునైనకు డ్యామేజ్ జరిగిందని బాబు గోగినేని తెలిపారు.నా విషయంలో కొన్ని చిల్లర పనులు చేశారు కానీ అది రియల్ డ్యామేజ్ అని భావించడం లేదు. బయటకు వచ్చిన తర్వాత నేను మళ్లీ షో చూడలేదు. ఎందుకంటే ఇది గేమ్… అందులో నేను ఎంజాయ్ చేశాను. బయటకు రావడాన్ని కూడా ఎంజాయ్ చేశాను… అని బాబు గోగినేని తెలిపారు.

మీరు గేమ్‌లో కొంత మందిని చూసి వాళ్లలో ఒకరిని మీ మనిషిగా ఎంచుకునే సీన్ అయితే లేదు. ఇది జస్ట్ గేమ్. మీరు వీళ్లు వాళ్లు అనుకున్నపుడు కొన్ని స్ట్రాంగ్ రీజన్స్ ఉండొచ్చు. 20 రోజుల్లోనో అంత ఆర్మీ క్రియేట్ చేసే సీన్ లేదు. కొంచెం ఇన్వెస్టిగేట్ చేస్తే ఇదంతా క్రియేటెడ్ థింగ్ అని తెలుస్తుంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ యాక్టివిటీ అని తేలిపోతుంది అని బాబు గోగినేని అభిప్రాయ పడ్డారు. నచ్చారో… నచ్చలేదో ఇప్పటి వరకు ఏదో ఒకటి చేశారు. ఇప్పటి నుండి చేయడం ఆపేయండి. అబ్యూస్ చేయడం వద్దు. ట్రోలింగ్ అంటే జెంటిల్ సైడ్ ఆఫ్ ట్రోలింగ్ ఓకే. ఉదాహరణకు నా ఫోటోను తీసుకుని దానికి తమాషాగా కొంటె కామెంట్ చేస్తారు. దానికి నేను కూడా నవ్వుకుంటాను. బూతు తిడితే ఇది ప్రాబ్లం…. అని బాబు గోగినేని తెలిపారు.

Related posts

కేరళ విద్యార్ధి ఆత్మహత్య… వరదలకు సర్టిఫికెట్లు పోయినందుకే…

jithu j

మీటూ : ఆమె ఆరోపణలు శింబుపైనేనా ?

ashok prasad

శ్రీశ్రీ స్వరూపానందాసరస్వతి స్వామి జన్మదిన వేడుకలు..

chandra sekkhar

Leave a Comment