telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

కోడికత్తి కేసులో శ్రీనివాస్ రావు బెయిల్ రద్దు చేసిన హై కోర్ట్!

YS Jagan Case transfer to NIA

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై హత్యాయత్నం కేసులో శ్రీనివాసరావు బెయిల్‌ బెయిల్‌ రద్దయింది. జగన్ పై కోడికత్తితో దాడిచేసిన నిందితుడు శ్రీనివాస్ కు హైకోర్టు బెయిల్‌ రద్దు చేసింది. శ్రీనివాసరావు బెయిల్‌ను రద్దు చేయాలని ఎన్‌ఐఏ పిటిషన్‌ దాఖలు చేసింది. ఎన్‌ఐఏ కోర్టు తమ విజ్ఞప్తిని సరిగా పరిశీలించలేదని పిటిషన్‌లో ఎన్‌ఐఏ పేర్కొంది. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ ఎన్ఐఏ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో ఇంకా దర్యాప్తు పూర్తికానందున నిందితుడి బెయిల్ ను రద్దు చేయాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. ఎన్‌ఐఏ తరపు న్యాయవాది వాదనలతో హైకోర్టు ఏకీభవించింది.

ఏపీ ప్రతిపక్ష నేత హోదాలో విశాఖ ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్ కు వస్తున్న జగన్ పై గతేడాది అక్టోబర్ 25న దాడి జరిగింది.ఈ కేసును తొలుత ఏపీ పోలీసులు, అనంతరం వారి నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణకు సేకరించాయి. క్రమంలో విజయవాడలోని ఎన్ఐఏ కోర్టు శ్రీనివాస్ కు ఈ ఏడాది మే 22న బెయిల్ మంజూరు చేసింది. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ ఎన్ఐఏ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

Related posts