telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

లైగర్ తో రొమాన్స్ చేయనున్న కత్రినా

టాలీవుడ్ లో పెళ్లి చూపులు చిత్రం తో హీరోగా మారి, అర్జున్ రెడ్డి చిత్రం తో యువత హృదయాలను కొల్లగొట్టాడు విజయదేవరకొండ. రాత్రికి రాత్రే విజయ్ కి ఎంతో పేరు తెచ్చి పెట్టింది ఈ సినిమా ఆ తరువాత వచ్చిన గీతా గోవిందం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే.. ఆ తరువాత వచ్చిన నోటా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫెమస్ లవర్ చిత్రాలు ఊహించిన స్థాయిలో ఆడలేదు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ ‘లైగర్’తో బిజీగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో విజయ్ బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇస్తున్నాడు. అనన్యపాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో స్ట్రెయిట్ సినిమా చేయబోతున్నాడు విజయ్ దేవరకొండ. అందులో విజయ్ సరసన కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించబోతోందట. ఇదిలా ఉంటే ఇటీవల ఇన్ స్టాలో విజయ్ దేవరకొండను ఫాలో అవటం మొదలు పెట్టింది కత్రినా కైఫ్‌. తెలుగునాటే కాదు విజయ్ కి దేశం మొత్తంలో చక్కటి ఫ్యాన్ బేస్ ఉంది. ఇన్ ష్టాలో ఎక్కవ మంది ఫాలో అవుతున్న హీరోల్లో విజయ్ ముందు వరుసలో ఉంటాడు. 

Related posts