telugu navyamedia
telugu cinema news trending

అతనితో విడిపోవడం ఆశీర్వాదం లాంటిది… రణబీర్ తో బ్రేకప్ పై కత్రినా కామెంట్స్

Kathrina

బాలీవుడ్ ఇండస్ట్రీలో బ్రేకప్ అనే మాట సర్వసాధారణం. కొన్నేళ్ల పాటు ప్రేమలో మునిగితేలి అనుకోని రీతిలో విడిపోయిన హీరోహీరోయిన్లను చాలామందినే చూశాం. బ్యూటిఫుల్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా ఆ లిస్టులో ఉందని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌తో కత్రినా నడిపిన ప్రేమాయణం, ఆ సంగతులు అందరికీ తెలిసినవే. అయితే ఎవ్వరూ ఊహించని రీతిలో అతనికి బ్రేకప్ చెప్పిన కత్రినా.. తాజా ఇంటర్వ్యూలో రణ్‌బీర్ క్యారెక్టర్ గురించి చెబుతూ బ్రేకప్ గురించి కొన్ని రహస్యాలు వెల్లడించింది. అతని నుంచి విడిపోవడమే మంచిదయ్యిందని, తనకు అదొక ఆశీర్వాదం లాంటిదని, రణ్‌బీర్‌ క్యారెక్టర్ చాలా చాలా డిఫరెంట్ అని కత్రినా తెలిపింది. అతనితో వేగడం చాలా కష్టమైన పని అని, ఆ విషయాన్ని తాను చాలా ఆలస్యంగా తెలుసుకున్నానని చెప్పింది. దీంతో తానే స్వయంగా అతనికి బ్రేకప్ చెప్పి ఆ లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్ వేశానని తెలిపింది. ఈ మేరకు బ్రేకప్ మూమెంట్ కూడా వివరించింది కత్రినా. ఓ రోజు జిమ్‌లో తెగించేసి రణ్‌బీర్‌కి వార్నింగ్ ఇవ్వడమే కాకుండా బ్రేకప్ కూడా చెప్పేశానని చెప్పిన కత్రినా.. అప్పటి నుంచి ప్రేమ, డేటింగ్ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలని అనిపించిందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రణ్‌బీర్ మరో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్‌తో లవ్ ట్రాక్ నడిపిస్తున్న విషయం తెలిసిందే.

Related posts

స్టార్ హీరోయిన్ ను చంపాలనుకున్న యువకుడు…!?

ashok

ఫైర్ బ్రాండ్ ‘సంధ్య’ విడుదల చేసిన “రాంగ్ గోపాల్ వర్మ” పోస్టర్

vimala p

వేడుకలు కూడా రహస్యమేనా .. అంటున్న నటి రాఖీ సావంత్ ..

vimala p