telugu navyamedia
సినిమా వార్తలు

పెళ్ళి విషయం… ఎమోషనల్ అయిన కత్రినా

Katrina-Kaif

బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ కు ఇటీవల థగ్స్ ఆఫ్ హిందుస్తాన్, జీరో రూపంలో భారీ డిజాస్టర్లు ఎదురయ్యాయి. తాజాగా ఆమె సల్మాన్ ఖాన్ సరసన మరోమారు నటించిన “భారత్” చిత్రం విడుదలవ్వడానికి సిద్ధమవుతోంది. గతంలో సల్మాన్, కత్రినా మధ్య ఘాటు ఎఫైర్ సాగినట్లు వార్తలు ఉన్నాయి. తాజాగా కత్రినా కైఫ్, సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకుకోవాలని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ నుంచి డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ప్రస్తావించగా కత్రినా ఎమోషనల్ అయ్యారు. “నా చిన్నతనంలోనే మా అమ్మానాన్న విభేదాలతో విడిపోయారు. తండ్రి లేకుండా పెరిగాను. ఎవరితోనూ పెద్దగా మాట్లాడేదాన్ని కాదు. లాంటిది ఇప్పుడు నటిగా రాణిస్తున్నాను అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇక పెళ్లి గురించి ఆలోచించినప్పుడల్లా నా బాల్యమే గుర్తొస్తుంది. నాలాగా నా పిల్లలు తండ్రి దగ్గర లేకుండా పెరగకూడదు. తల్లిదండ్రుల మధ్య ప్రేమానురాగాలతో వాళ్ళు పెరగాలి. అలాగని తండ్రి లేనంత మాత్రాన జీవితంలో సర్వం కోల్పోయినట్లు కాదు. నేను ఏడుగురు తోబుట్టువుల మధ్య తండ్రి లేకుండానే పెరిగాను” అని కత్రినా గుర్తు చేసింది. కాగా భారత్ చిత్రం జూన్ 5న విడుదల కానుంది.

Related posts