telugu navyamedia
సినిమా వార్తలు

200 కోట్ల పెళ్లి వేడుకలో కత్రినా డ్యాన్స్

Kathrina-Kaif

ప్రముఖుల పెళ్ళిలో సెలెబ్రిటీలు ఆటపాటలతో సందడి చేయడం సర్వసాధారణం. అందుకోసం వారికి భారీగా పారితోషికం అందుతుంది. తాజగా డెహ్రాడూన్‌లోని ఔలీ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం తమ కుటుంబ సభ్యుడి పెళ్లి వేడుకను అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసింది. ఈ వేడుక కోసం ఏకంగా 200 కోట్లు ఖర్చు చేయడం విశేషం. ఈ పెళ్లిలో కత్రినా తను నటించిన “తీస్ మార్ ఖాన్” చిత్రంలోని “షీలా కీ జవానీ” పాటకు డ్యాన్స్ చేసి ఆకట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమెతో పాటు పలువురు టీవీ ప్రముఖులు కూడా పెళ్లిలో సందడి చేశారు. బుల్లితెర న‌టి సుర‌భీ కూడా త‌న స్టెప్పుల‌తో అల‌రించింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇటీవలే సల్మాన్ కు జోడిగా కత్రినా నటించిన “భారత్” చిత్రం విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను కొల్లగొడుతోంది. ఇప్పటికే ఈ చిత్రం 250 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది.

Related posts