telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విజయ్‌ సినిమాలో బాలీవుడ్‌ హీరోయిన్‌..!

katrina

కత్రినా కైఫ్ బాలీవుడ్‌లో భారీ ఫోలోయింగ్ ఉన్న హీరోయిన్‌లలో ఒకరు. తన అందం అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. యాక్షన్ హీరోయిన్‌గా కూడా మంచి పేరుతెచ్చుకున్న ఈ అమ్మడు దక్షిణాదిలో మరో సినిమా చేయనుంది. ఈ ముద్దుగుమ్మ మొదట తెలుగులో విక్టరీ వెంకటేష్ సరసన 2004లో మళ్లీశ్వరీ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత మళ్లీ 2005లో నందమూరి నటసింహం బాలకృష్ణ అల్లరి పిడుగు సినిమాలో చేసింది. అదేవిధంగా 2006లో బలరామ్ వర్సెస్ తారదాస్ అనే మలయాళం సినిమాలో చేసింది. దాని తర్వాత బాలీవుడ్‌కే పరిమితమైంది. మళ్లీ 14ఏళ్ల తర్వాత దక్షిణాదిలో నటించనుంది. అదికూడా స్టార్ హీరో విజమ్ సేతుపతి హీరోయిన్‌గా చేయనుంది. ఈ సినిమా శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో రూపొందనుంది. ఇందులో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. దక్షిణ భారత్‌లో మంచి నటుడిగా భారీ గుర్తింపు పొందిన వారిలో విజయ్ సేతుపతి కూడా ఒకడు. ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రతిసారి విలక్షణ కథలతో వారిని ఆకట్టుకంటాడు. అయితే ఇప్పుడు ఇతడి సరసన బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ నటించనుంది. దీంతో ఈ కాంబోపై అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. మరి వారిని ఎంతవరకు మెప్పిస్తాయో చూడాలి.

Related posts