• Home
  • Trending Today
  • “సురయ్యా”గా మత్తెక్కిస్తున్న కత్రినా
Trending Today సినిమా వార్తలు

“సురయ్యా”గా మత్తెక్కిస్తున్న కత్రినా

Katrina-kaif-as-Suraiyya

బాలీవుడ్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్‌, మిస్ట‌ర్ ఫ‌ర్‌ఫెక్ష‌నిస్ట్ ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం `థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్‌`. 1839 కాలం నాటి `క‌న్ఫెష‌న్స్ ఆఫ్ థ‌గ్‌` న‌వ‌ల ఆధారంగా అత్యంత భారీ బ‌డ్జెట్‌తో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతున్న ఈ సినిమాకు `ధూమ్‌-3` ఫేమ్‌ దర్శకుడు విజ‌య్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఆమిర్‌, అమితాబ్‌ల‌తోపాటు కత్రినా కైఫ్‌, ఫాతిమా స‌నా షేక్‌, రోనిత్ రాయ్ వంటి నటులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

ఈ సినిమాలో కత్రినా కైఫ్ ‘సురయ్యా’ పాత్రలో కనిపించనుంది. ఆ పాత్రకి సంబంధించిన ఆమె ఫస్టులుక్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో కత్రినా మరింత గ్లామరస్ గా కనిపిస్తూ .. మత్తెక్కించే చూపులతో కుర్రకారు మతులుపోగొడుతోంది. రేపు అమీర్ ఖాన్ ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతోన్న ఈ సినిమాను, దీపావళి కానుకగా నవంబర్ 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

తాజాగా ఈ సినిమాలోని అమితాబ్ లుక్‌ను చిత్ర‌బృందం విడుద‌ల చేసింది. ఈ సినిమాలో అమితాబ్‌.. ఖుదాబ‌క్ష పాత్ర‌లో నటిస్తున్నారని పోస్టర్ లుక్ లో ప్రకటించారు. ఈ పోస్ట‌ర్ లో బిగ్ బి లుక్ కు మంచి స్పందన లభించింది. ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫాతిమా, ప్రతినాయకుడిగా నటిస్తోన్న లాయిడ్ ఒవెన్ పాత్రలను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేశారు.

Related posts

`దేశంలో దొంగ‌లు ప‌డ్డారు`…

admin

హౌస్ లో ‘మను’… తనీష్ కారులోమూత్రం!

jithu j

యాపిల్ కు..గూగుల్ భారీగా చెల్లింపులు..65 వేల కోట్లు…

chandra sekkhar

Leave a Comment