telugu navyamedia
సినిమా వార్తలు

సల్మాన్ తో నా అనుబంధం ప్రత్యేకం : కత్రినా కైఫ్

Salman-Khan-and-Katrina-Kaif

సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన చివరి చిత్రం “భారత్”. తెరపై వీరిద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు కత్రినా కైఫ్, సల్మాన్ ఖాన్ రిలేషన్ గురించి చాలా రోజులుగా బాలీవుడ్ లో ఊహాగానాలు ఉన్న విషయం తెలిసిందే. కత్రినా బాలీవుడ్ కు వెళ్లిన కొత్తల్లో సల్మాన్ ప్రేమలో పడింది అంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రణబీర్ కపూర్ తో సహజీవనం చేసింది. వారిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు కూడా అప్పట్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇక 2017లో ఈ జంట విడిపోయింది. దీనితో కత్రినా కైఫ్ మరోసారి సల్మాన్ ఖాన్ చేరువైనట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా సింగపూర్ కు ఓ కార్యక్రమం కోసం వెళ్లిన కత్రినా సల్మాన్ ఖాన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా సల్మాన్ గురించి కత్రినా మాట్లాడుతూ “నాకు బాలీవుడ్‌లో ఎవరూ తెలియని దశలో నేను చాలా ఇబ్బందులు పడ్డాను. అలాంటి సమయంలో నాకు సల్మాన్ పరిచయమయ్యారు. అప్పట్నుంచి ఆయన నా వెన్నంటే ఉన్నారు. ఇతరుల కష్టాలను అర్థం చేసుకునే మనస్తత్వం ఆయనది. ఆయనతో నా అనుబంధం ప్రత్యేకమైనది. సల్మాన్‌తోనూ ఆయన చెల్లెళ్లతోనూ నాకు మంచి అనుబంధముంది” అని కత్రిన చెప్పింది.

Related posts