telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

లివ్-ఇన్ రిలేషన్షిప్ గురించి… కత్తి మహేష్ క్లాస్ .. ఎవరికంటే.. !

kathimahesh on living relationship

మరోసారి సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ వార్తల్లో నిలిచారు. ‘ఆర్ఎక్స్100’ ఫేమ్ కార్తికేయ..దిగంగన సూర్యవంశీ, జజ్బా సింగ్ జంటగా టీఎన్ క్రిష్ణ దర్శకత్వం తెరకెక్కిన హిప్పీ చిత్రం ఈరోజు తెలుగు, తమిళ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండగా..కత్తి మహేష్ షాకింగ్ రివ్యూ ఇచ్చి వార్తల్లో నిలిచారు. దర్శకుడు టీఎన్ క్రిష్ణను టార్గెట్ చేస్తూ హాట్ కామెంట్స్ చేశారు.

కత్తి మహేష్, లివ్-ఇన్ రిలేషన్షిప్ అంటే ఒక ఆడామగా జంట కలిసి, వేరువేరు బెడ్రూమ్‌లలో బ్రతకడం కాదు అని క్లాస్ చెప్పాడు. ఫుడ్డు-బెడ్డు కూడా కలిసి పంచుకుని ఒక ఇంట్లో జీవించడం. పెళ్లి కాకుండానే మొగుడూ పెళ్లాలల్లాగా సంసారం చెయ్యడం.ఈ పిచ్చి హాఫ్ నాలెడ్జ్ దర్శకులకి ఈ విషయం ఎవరైనా చెప్పండయ్యా’ అంటూ ఇన్ డైరెక్ట్‌గా దర్శకుడు టీఎన్ క్రిష్ణను టార్గెట్ చేస్తూ షాకింగ్ రివ్యూ కూడా ఇచ్చాడు కత్తి. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

Related posts