telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పవన్ పై కత్తి మహేష్ వివాదాస్పద వ్యాఖ్యలు

KAthi-Mahesh

వివాదాస్పద క్రిటిక్ కత్తి మహేష్ మరోసారి పవన్ కళ్యాణ్ పై సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు. గతంలో శ్రీరాముడు పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తెలంగాణ నుండి బహిష్కరణకు గురైన కత్తి మహేష్ ఆ తరువాత కొన్నిరోజులు సైలెంట్ అయిపోయారు. మరోవైపు “జనసేన” ఘోర పరాజయం తరువాత పవన్ ప్రస్తుతం గోదావరి జిల్లాలలో పర్యటన చేస్తూ అక్కడి జనసైనికులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. తాను జీవించి ఉన్నంత కాలం “జనసేన” పార్టీని ఏ పార్టీలోనూ విలీనం చేయనని ప్రకటించాడు. ఈ విషయంపై స్పందించిన కత్తి మహేష్ “జనసేన పార్టీని ఏ పార్టీలోనూ విలీనం చేయం- పవన్ కళ్యాణ్… నిజమే… విలీనం చేస్తే వన్ టైం సెటిల్ మెంట్ అయిపోతుంది. ఇలాగే ఉంటే అవసరానికి తగ్గట్టు ప్యాకేజీలు వస్తూనే ఉంటాయి” అంటూ కత్తి మహేష్ వివాదాస్పద కామెంట్స్ చేసాడు. ఇప్పుడు ఈ కామెంట్స్ పవన్ అభిమానుల దృష్టి వరకు వెళ్ళడంతో వారంతా కత్తి మహేష్ పై కారాలు మిరియాలూ నూరుతున్నారు. అయితే ఇలాంటి విమర్శలను పట్టించుకోని పవన్ ప్రస్తుతం గోదావరి జిల్లాలలో చేస్తున్న పర్యటనకు వస్తున్న అపూర్వ స్పందన చూసిన వారికి అసలు పవన్ కళ్యాణ్ భీమవరంలో ఎందుకు ఓడిపోయాడనే సందేహానికి సమాధానం లేకుండా పోయింది. ఇక కత్తి మహేష్ వ్యాఖ్యలపై పవన్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Related posts