telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అడల్ట్ మూవీకి “కత్తి” ప్రమోషన్స్

Kathi-Mahesh

అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100 సినిమాలు టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ ను సృష్టించాయి. దీంతో తెలుగులో ఆ తరహా రొమాంటిక్ ప్రేమకథలు పెరిగిపోయాయి. ఇంకా కొందరైతే ఇంకాస్త ముందుకెళ్లి అడల్ట్ కామెడీ కంటెంట్ చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఓ అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమా టీజర్ కత్తి మహేష్ కన్పించడం హాట్ టాపిక్ గా మారింది. కత్తి మహేష్ సినిమాల రివ్యూ రైటర్ గా, రాజకీయ విశ్లేషకుడుగా బాగానే పేరు సంపాదించాడు. అయితే తాజాగా ఓ అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమా టీజర్ లో దర్శనమిచ్చి అందరికీ షాకిచ్చాడు. “చీకటి గదిలో చితక్కొట్టుడు” అనే తమిళ డబ్బింగ్ సినిమా తెలుగులో వస్తోంది. ఈ చిత్రానికి సంబందించిన టీజర్ లో కత్తి మహేష్‌ కంపించడంతో ఈ వీడియో కాస్తా వైరల్ అయ్యింది. టీజర్ మొత్తాన్ని అడల్ట్ కంటెంట్ తో నింపేశారు. టీజర్ చివర్లో కత్తి “మూడు రోజులు ఆడే సినిమా ఇది… డిబేట్లు పెట్టి హిట్‌ చేసెయ్యొద్దు…” అంటూ ముగించాడు. మీరు కూడా ఈ టీజర్ ను ఓసారి వీక్షించండి.

Related posts