telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కథానాయకుడు : ప్రీమియర్ షో టాక్… కౌంటర్ పడినట్లేనా…

NTR Biopic

దర్శకుడు క్రిష్ కాంట్రవర్సి వైపు వెళ్లకుండా తనదైన స్టైల్ లో నేరుగా కథలోకి వెళ్ళాడు. 1984 మద్రాస్ లో బసవతారకం ట్రీట్మెంట్ తో సినిమా కథ మొదలవుతుంది. హరికృష్ణగా కళ్యాణ్ రామ్ ఎంట్రీ… ఆ తరువాత 1947 బ్యాక్ గ్రౌండ్ లోకి కథ మారుతుంది. ఎన్టీఆర్ రిజిస్టర్ గా పని చేయడం… ఆ తరువాత నటన, సినిమా అవకాశాల కోసం వెతుక్కుంటూ వెళ్లడం… మాయ బజార్ సీన్స్… అక్కినేని నాగేశ్వరరావు ఎన్టీఆర్ కి సంబంధించిన సన్నివేశాలు… ఇంటర్వెల్ టైమింగ్ లో ఎన్టీఆర్ పెద్ద కొడుకు మరణానికి సంబంధించిన ఎమోషనల్ సీన్స్ … సెకండ్ హాఫ్ ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్న సినిమాల కు సంబంధించిన సీన్స్… ఎన్టీఆర్ డైరెక్ట్ చేసిన దాన వీర్ శుర కర్ణ లోని భళారే విచిత్రం లో బాలకృష్ణ – శ్రీయ స్క్రీన్ ప్రజెన్స్…

యమగోల – అడవిరాముడు సినిమాలకు సంబంధించిన ట్రెండ్ సెట్ సాంగ్స్… అనంతరం ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ… నారా చంద్రబాబు గా రానా ఎంట్రీ… తెలుగుదేశం పార్టీ అధికారిక ప్రకటనతో సినిమా ఎండ్ కావడం … సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా నడిపించాడు క్రిష్. ఇక ఎన్టీఆర్ గా బాలయ్య నటన అద్భుతం… కీరవాణి సంగీతం సినిమాను మరో ప్లస్ పాయింట్. ఆ తరువాత చెప్పుకోవాల్సింది సినిమాలోని సెట్స్ గురించే… అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా సెట్స్ ను తీర్చిదిద్దారు. పాత్రల ఎంపిక విధానం కలిసొచ్చింది. కొన్ని సన్నివేశాలు బోరింగ్ గా అనిపించినా సినిమాలో అవి ఉండి తీరాల్సిందే… మరి ఆడియన్స్ తీర్పు ఎలా ఉంటుందో చూడాల్సిందే.

Related posts