telugu navyamedia
రాజకీయ వార్తలు

పాకిస్థాన్ కు మరో ఎదురుదెబ్బ.. భారత్ కు మద్దతుగా దక్షిణాసియా దేశాలు!

pak will lose if war declared with india

జమ్మూకశ్మీర్ విషయంలో భారత్ ను ఇరుకున పెట్టేందుకు పాకిస్థాన్ చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. ఈ విషయంలో పాకిస్థాన్ నానా రచ్చ చేసినప్పటికీ ప్రపంచదేశాలన్నీ భారత్ కే మద్దతుగా నిలిచాయి. తాజాగా మాల్దీవుల పార్లమెంటులో పాకిస్థాన్ కు ఈ విషయంలో ఎదురుదెబ్బ తగిలింది. జమ్మూకశ్మీర్ అన్నది పూర్తిగా భారత్ అంతర్గత విషయమని మాల్దీవుల్లో జరుగుతున్న దక్షిణాసియా పార్లమెంటరీ స్పీకర్ల సదస్సు తీర్మానించింది.

ఈ సందర్భంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాకిస్థాన్ పార్లమెంటరీ బృందం చేసిన డిమాండ్లను తిరస్కరించింది. పాకిస్థాన్-చైనా ఆర్థిక కారిడార్(సీపీఈసీ) విషయంలోనూ పాక్ సవరణలకు డిక్లరేషన్ లో చోటు దక్కలేదు. ఈ భేటీలో భారత ప్రతినిధి బృందానికి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా నేతృత్వం వహించారు. ఆయన ప్రతిపాదించిన పలు సవరణలకు సదస్సులో ఏకగ్రీవ ఆమోదం లభించింది.

Related posts