telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

కారులో పేలుళ్లు.. అప్రమత్తమైన సైన్యం

Kashmir Crpf area blast car

జమ్మూకశ్మీర్‌లోని రాంబన్‌ జిల్లాలోని బనీహల్‌లో ఈ రోజు మధ్యాహ్నం ఓ కారులో పేలుడు సంభవించింది. బనిహాల్ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్ దళాల వాహనాలు ప్రయాణిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ పేలుళ్ల ధాటికి కారు ధ్వంసమైంది. కారులో పేలుళ్లు జరగడంతో సైన్యం అప్రమత్తమైంది. కారులోని సిలిండర్‌ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

బనిహాల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కారులో సిలిండర్ పేలింది. కారులోని సిలిండర్ లీక్ అవడంతో గ్యాస్‌కు నిప్పు అంటుకుని ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు ధ్రువీకరించారు. జమ్మూ హైవేపై ఈ అంతుబట్టని పేలుడు ప్రభావంతో ఆ కారు ధ్వంసమైంది. ఆ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.

Related posts