telugu navyamedia
crime news

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్..ఇద్దరు ఉగ్రవాదుల హతం

2 terrorists killed in Jammu and Kashmir

జమ్మూకశ్మీర్‌లోని అనంత్ నాగ్ జిల్లాలో ఈ తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.వఘామా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్టు ముందస్తు సమాచారం అందుకున్న జమ్మూకశ్మీర్‌కు చెందిన రాష్ట్రీయ రైఫిల్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఈ ఉదయం గాలింపు చర్యలు చేపట్టారు.

భద్రతా దళాల రాకను గమనించిన ఉగ్రవాదులు వెంటనే వారిపైకి కాల్పులు జరిపారు. అప్రమత్తమైన జవాన్లు ఎదురు కాల్పులు ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు. ఈ నెల 26న వీరు జరిపిన కాల్పుల్లో సీఆర్‌పీఎఫ్ జవాన్ శ్యామల్ కుమార్‌తోపాటు ఐదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయినట్టు ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ నెలలో ఇప్పటి వరకు 14 ఎన్‌కౌంటర్లు జరగ్గా 36 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

Related posts

ఉన్నవో కేసు : .. ఎమ్మెల్యే తరువాత .. మరో ముగ్గురు వారం పాటు సామూహికంగా .. సీబీఐ నివేదిక..

vimala p

ఇంగ్లాండ్ కొత్త కోచ్‌గా క్రిస్ సిల్వర్‌వుడ్

vimala p

దీపావళికి .. వేడినీటి స్నానం చేయటం అంత ముఖ్యమా..

vimala p