telugu navyamedia
సినిమా వార్తలు

కార్తికేయ “90 ఎమ్ఎల్” ఫస్ట్ లుక్

90-ml

“ఆర్‌ఎక్స్‌ 100” ఫేమ్ కార్తికేయ కథానాయకుడిగా కార్తికేయ క్రియేటివ్‌ వర్క్స్‌ పతాకంపై అశోక్‌రెడ్డి గుమ్మకొండ కాంబినేషన్‌లో, శేఖర్‌రెడ్డి ఎర్ర దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి “90 ఎంఎల్‌” అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ సందర్భంగా నిర్మాత అశోక్‌రెడ్డి మాట్లాడుతూ “టైటిల్‌కి తగ్గట్టు సినిమా వైవిధ్యంగా ఉంటుంది. ఇప్పటికే 70శాతం చిత్రీకరణ పూర్తయింది. దర్శకుడికి తొలి చిత్రమైనా బ్రహ్మాండంగా తీస్తున్నారు” అన్నారు. శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ “ఆర్‌ఎక్స్‌ 100’కు వచ్చిన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని, అంతకుమించి ఉండేలా “90 ఎంఎల్‌” కథ రాసుకున్నా. సినిమాలో ఆరు పాటలకు అనూప్‌ రూబెన్స్‌ అద్భుత స్వరాలు ఇవ్వగా… చంద్రబోస్‌గారు యువతను ఆకట్టుకునేలా పాటలు రాశారు. ఈ నెల 11న హైదరాబాద్‌లో క్లైమాక్స్‌ తెరకెక్కిస్తాం. తర్వాత మరో షెడ్యూల్‌లో టాకీ పార్ట్‌ బ్యాలెన్స్‌, రెండు పాటలు చిత్రీకరిస్తాం” అన్నారు. నేహా సోలంకి కథానాయికగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో రవికిషన్‌, రావు రమేశ్‌, అజయ్‌, ‘కాలకేయ’ ప్రభాకర్‌, సత్య ప్రకాశ్‌, ప్రగతి తదితరులు ముఖ్య తారాగణం.

Related posts