telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“90 ఎంఎల్” ట్రైలర్

90ml

ఒకవైపు హీరోగా మరోవైపు విలన్ గా తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న యంగ్ హీరో కార్తికేయ‌. ఆర్ఎక్స్ 100, హిప్పీ, గుణ‌ 369, గ్యాంగ్ లీడ‌ర్ వరుస చిత్రాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నారు కార్తికేయ. తాజాగా కార్తికేయ క్రియేటివ్ వ‌ర్క్స్ ప‌తాకంపై అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ నిర్మాణంలో “90ఎం.ఎల్” అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంతో శేఖ‌ర్ రెడ్డి ఎర్ర ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. నేహా సోలంకి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో రావు రమేష్, రవి కిషన్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దర్శకుడు శేఖర్ రెడ్డి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో కార్తికేయ ఆల్కహాలిక్‌గా కనిపించబోతున్నాడు. భోజనం చేసిన ప్రతీసారి 90ఎమ్ఎల్ ఆల్కహాల్ తీసుకోకపోతే చనిపోయే వ్యక్తిగా కార్తికేయ కనిపించనున్నట్టు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.

Related posts