telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కార్తీకదీపం వంటలక్క దీప పారితోషికం తెలిస్తే షాక్….!

Karthika-Deepam

బుల్లితెరపై ప్రసారమయ్యే కొన్ని సీరియళ్ళకు విశేషమైన ఆదరణ లభిస్తున్న విషయం తెలిసిందే. ఈ సీరియల్స్ లో కొంతమంది పాత్రధారులు బుల్లితెర ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అలాంటి జాబితాలో “కార్తీక దీపం” సీరియల్ ఒకటి. బుల్లితెరపై అతి తక్కువ సమయంలో అభిమానులను సంపాదించుకున్న “కార్తీక దీపం” సీరియల్ ఇంకా విశేష ఆదరణతో దూసుకెళుతోంది. కార్తీక దీపం సీరియల్ అనగానే మనందరికీ గుర్తుకువచ్చే కేరక్టర్ దీప అలియాస్ వంటలక్క. తెలుగు రాష్ట్రాల్లో మహిళా ప్రేక్షకులందరినీ ఉర్రూతలూగించిన కార్తీక దీపం సీరియల్ లో వంటలక్క అనగానే అందరికీ ఎంతో అభిమానం. గత మూడేళ్లుగా స్టార్ మాలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ అశేష ప్రజాదరణతో దూసుకెళుతోంది. స్టార్ హీరోయిన్లకు సైతం లేని ఫాలోయింగ్ ఈ సీరియల్ కేరక్టర్లకు ఉందంటే ఆశ్చర్యం కలగకమానదు. అయితే ఈ సీరియల్ లీడ్ కేరక్టర్ పోషించిన ప్రేమి విశ్వనాథ్ నటనకు ప్రతీ ఒక్కరూ ఫిదా అవతున్నారు. కాగా తాజాగా కార్తీక దీపం దీపకు ఒక ప్రతిష్టాత్మక అవార్డు అందుకుంది. స్టార్ మా నిర్వహించిన స్టార్ మా పరివార్ అవార్డ్స్ లో వంటలక్క అలియాస్ దీపకు బెస్ట్ ఉమెన్ కేరక్టర్ అందుకుంది. అయితే తెలుగు కన్నా ముందే ఈ సీరియల్ మళయాలంలో కారుముత్తు పేరిట ప్రసారమై 7 సంవత్సరాలు నిరాఘాటంగా సాగి ముగిసింది. ఆ సీరియల్ లో సైతం లీడ్ కేరక్టర్ పోషించింది ప్రేమి విశ్వనాథ్‌యే కావడం విశేషం. అయితే మళయాళంలో ప్రేమి విశ్వనాథ్ ఒక్కో ఎపిసోడ్ కు రూ.15 వేల వరకూ పారితోషికం అందుకుందని టాక్. తెలుగులో ఇంత క్రేజ్ సంపాదించిన ప్రేమివిశ్వనాథ్ అలియాస్ దీప అలియాస్ వంటలక్క భారీ మొత్తంలోనే పారితోషికం అందుకుంటోందని టాక్ ఉంది. ముఖ్యంగా తెలుగులో బుల్లితెరపై ఏ ఆర్టిస్ట్ కూడా అందుకోని రేంజులో ప్రేమి విశ్వనాథ్ చార్జ్ చేస్తుందని టాక్. కార్తీక దీపం సీరియల్ కు ఒక్కో ఎపిసోడ్ కు కనీసం 1 లక్ష రూపాయలు ప్రేమి విశ్వనాథ్ వసూలు చేస్తోందట.

Related posts