telugu navyamedia
సినిమా వార్తలు

కార్తికేయ “హిప్పీ” ట్రైలర్

Hippi-Trailer

కార్తికేయ హీరోగా నటించిన “ఆర్ఎక్స్ 100” సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా కార్తికేయ ఇమేజ్ పెరిగిపోయింది. కార్తికేయకు వరుస అవకాశాలు వెతుక్కుంటూ వస్తుండగా, ఆయన తరువాత సినిమా గురించి ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల కార్తికేయ “హిప్పీ” అనే ద్విభాషా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ టీజర్ ను ఇటీవలే విడుదల చేశారు. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో “”ఒక అమ్మాయిని మనం లవ్ చేస్తే.. ప్యారడైజ్ బిగిన్స్.. అదే అమ్మాయి మనల్ని తిరిగి లవ్ చేయడం స్టార్ట్ చేస్తే.. మై ప్యారడైజ్ లాస్ట్” అంటూ కార్తికేయ చెప్పే డైలాగ్, “అమ్మాయిలను చందమామతో ఎందుకు పోలుస్తారో తెలుసా..? వాళ్లు ఒక్కొక్క దినం ఒక్కో మాదిరి ఉంటరు’ అని జెడి చక్రవర్తి చెప్పే డైలాగులు హైలైట్ గా నిలిచాయి. ఇందులో ఇద్దరు అమ్మాయిలను లవ్ చేస్తూ వారిద్దరి మధ్య నలిగిపోతుంటాడు హీరో. ఈ ట్రైలర్ ను మీరు కూడా వీక్షించండి.

Related posts