telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

కార్తీ ‘ఖైదీ’ .. థియేట్రికల్ ట్రైలర్…

karthik khaidi movie theatrical trailer

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో, కార్తీ నటిస్తున్న తమిళ సినిమా.. ‘ఖైదీ’ డ్రీమ్ వారియర్ పిక్చర్స్, వివేకానంద పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దోపిడీలు, డ్రగ్స్ రవాణా మరియు హత్యల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. దసరా సందర్భంగా ‘ఖైదీ’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. కార్తీ రఫ్ అండ్ టఫ్ మాస్ క్యారెక్టర్‌లో అలరించనున్నాడు. ట్రైలర్‌ చూస్తే సినిమా నేపథ్యం తెలుస్తుంది.

నరేన్, విజయ్ టివి దీనా, మరియమ్ జార్జ్ ఇంపార్టెంట్ రోల్స్ చేశారు. దీపావళికి తమిళనాట ‘ఖైదీ’ భారీగా విడుదల కానుంది. సిమాటోగ్రఫీ : సత్యన్ సూర్యన్, మ్యూజిక్ : శ్యామ్ సిఎస్, ఎడిటింగ్ : ఫిలోమిన్ రాజ్, ఆర్ట్ : ఎన్. సతీష్ కుమార్, స్టంట్స్ : అన్బరివు, డైలాగ్స్ : పోన్ పార్థిబన్, లోకేష్ కనగరాజ్, నిర్మాతలు : ఎస్.ఆర్.ప్రభు, ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, తిరుప్పుర్ వివేక్.

Related posts