telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

కెనడాలో… తొలి కరోనా కేసు నమోదు…

karona virus case in canada found

కరోనా వైరస్‌ క్రమంగా ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. కెనడాలో ఈ వైరల్‌ ఇన్ఫెక్షన్‌ కేసు తొలిసారి వెలుగు చూడగా, అమెరికాలో ఈ ఇన్ఫెక్షన్‌కు సంబంధించిన మూడో కేసు అధికారికంగా నమోదయినట్లు తెలుస్తోంది. కెనడాలోని ఒంటారియో నగరంలో కరోనా వైరల్‌ ఇన్ఫెక్షన్‌ అనుమానిత కేసు నమోదయినట్లు ప్రావిన్స్‌ అసోసియేట్‌ ప్రధాన వైద్యాధికారి డా.బార్బరా యాఫె చెప్పారు. 50 ఏళ్ల వయస్కుడైన ఈ పేషెంట్‌ చైనాలోని వుహాన్‌ నగరం నుండి కెనడాకు తిరిగి వచ్చాడని ఆయన వివరించారు.

ఆయన మాంట్రియల్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ టరంటోలో కరోనా వైరల్‌ ఇన్ఫెక్షన్‌ కేసు అధికారికంగా నమోదయిందని చెప్పారు. కెనడాలో ఇది తొలి కేసు అని ఆయన వివరించారు. కేలిఫోర్నియా రాష్ట్రంలోని ఆరెంజ్‌ కౌంటీలో ఒక వ్యక్తికి కరోనా వైరల్‌ ఇన్ఫెక్షన్‌ సోకినట్లు ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు. ఇన్ఫెక్షన్‌ సోకిన వ్యక్తి వుహాన్‌ చైనాలోని వుహాన్‌ నగరం నుండి తిరిగి వచ్చాడని, ఇతడికి ఆరోగ్య పరీక్ష నిర్వహించినపుడు వైరల్‌ ఇన్ఫెక్షన్‌ సోకినట్లు నిర్ధారణ అయిందని అధికారులు వివరించారు.

Related posts